Posani Krishna Murali : ఏపీలో వైసీపీ దారుణమైన ఓటమి చవిచూడడంతో మెల్లగా ఒక్కొక్కరు జారుకుంటున్నారు. చంద్రబాబు సీఎంగా, పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి.. తమ మార్క్ పాలనతో దూసుకుపోతుండడంతో వైసీపీకి నిద్రపట్టడం లేదు. ఇక ఆ నాడు పవన్‌ను, చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించిన నోళ్లన్నీ.. ఇప్పుడు సైలెంట్ అవుతున్నారు. వైసీపీ ఓటమితో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన అలీ.. ఇక రాజకీయాలు వద్దు అంటూ వైసీపీకి రాజీనామా చేశారు. ఇక పోసాని, శ్యామల వైసీపీకి సపోర్ట్ చేయగా వారిని దారుణంగా విమర్శిస్తున్నారు. వారు తమ ఇళ్ళకి తాళాలు వేసుకొని బతుకుతున్నారంటూ ఒక టాక్ వినిపిస్తుంది. ఇంటి లోపలే ఉండి. బయట తాళాలు వేసుకుంటున్నారు. కనీసం పాల వాళ్ళు వచ్చి పిలిచినా తలుపు తియ్యటం లేదు. అలీ అయితే ఏటో వెళ్లిపోయాడనే వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు నట్టి కుమార్ ఈ విషయాన్నీ వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్ లో మొన్నటికి దాకా అధికారంలో ఉన్న వైసీపీ కి వకాల్తా పుచ్చుకొని టిడిపి,జనసేన అధినేతలైన చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ ని నానా దుర్భాషలు ఆడారు. సభ్యసమాజం మొత్తం ఆ ముగ్గురు మాట్లాడిన మాటలకి తలదించుకుంది. ఇక ఇప్పుడు టీడీపీ, జనసేన అధికారంలోకి రావడంతో భయంతో తాళాల ఆట ఆడుకుంటూ కర్మ అనుభవిస్తున్నారు అని నట్టి చెప్పుకొచ్చారు. అయితే పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక.. ఏకంగా రాజకీయాలు వదిలేశారు అలీ. సినిమాలు, షూటింగ్‌లే లోకం అంటున్నారు. ఇదంతా పవన్ ఫ్యాన్స్ ఎఫెక్టే అనే చర్చ జరుగుతోంది.
ఆలీ సంగతి అటుంచితే పోసాని పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. పవన్ విషయంలో పోసాని చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జగన్‌కు వంత పాడడంతో పాటు.. పవన్ కేరక్టర్ డీగ్రేడ్ చేసేలా పోసాని మాట్లాడారు అని.. జనసైనికులు, పవర్‌స్టార్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. అలాంటి పోసాని పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.పిఠాపురంలో పవన్ ఓడిపోతారు అన్న శ్యామలకే.. జనసేన కార్యకర్తలు చుక్కలు చూపిస్తున్నారు. అలాంటిది పోసాని వదులుతారా.. నెక్ట్స్ వేసేది నిన్నే గురూ అంటూ వార్నింగ్‌లు పంపుతున్నారు. ఎలా ఉన్నా.. అలీ వైసీపీ ముద్ర నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి పోసాని ఏం చేస్తారు.. సినిమాలే ముఖ్యం అనుకొని బయటకు వస్తారా.. వైసీపీకి విధేయుడిలా ఉంటారా అనే విషయంపై ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.