Anil Kumar Yadav : పులకేసి ప్రతి ఊరు తిరుగుతూ మేం నిప్పు అంటున్నాడు.. దమ్ముంటే విచారణకి వెళ్లు.. అనిల్ కుమార్ యాదవ్ పంచ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anil Kumar Yadav : పులకేసి ప్రతి ఊరు తిరుగుతూ మేం నిప్పు అంటున్నాడు.. దమ్ముంటే విచారణకి వెళ్లు.. అనిల్ కుమార్ యాదవ్ పంచ్

 Authored By kranthi | The Telugu News | Updated on :8 September 2023,12:00 pm

Anil Kumar Yadav : నన్ను ఇవాళో రేపో అరెస్ట్ చేసినా చేస్తారు అని టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేపుతోంది. 118 కోట్ల అవినీతిలో ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని.. ఇందులో నారా లోకేష్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెబుతున్నారు. అందుకే త్వరలోనే చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. గత నెలలో దానికి సంబంధించిన ఐటీ నోటీసులు చంద్రబాబుకు ఇస్తే ఇప్పటి వరకు విచారణకు కూడా హాజరు కాలేదు. అంటే చంద్రబాబు తప్పు చేసినట్టు కదా.చంద్రబాబుకు వచ్చిన నోటీసులపై, ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. నారా లోకేష ఏం పతివ్రత కాదని.. మా డాడీ నిప్పు అంటావు..

నువ్వు ఏంటయ్యా మరి.. నువ్వు తుప్పా? నువ్వు కూడా మీ నాన్నతో కలిసి విచారణకు వెళ్లాలి అని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.మేం నిజాయితీపరులం అని నారా లోకేష్ తెగ మాట్లాడుతున్నాడు కదా. లోకేష్ పేరు అందులో లేదా? 46 పేజీలలో 118 కోట్ల స్కామ్ కు సంబంధించి చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు కూడా ఉంది. దుబాయిలో కూడా వీళ్లకు ముడుపులు అందాయి. కేవలం రెండు ఏజెన్సీల నుంచే 118 కోట్లు తీసుకున్నారు. అమరావతి భూములు అనే దాని పేరుతో అతి పెద్ద భూదందా, కమిషన్ల దందా జరిగింది. చంద్రబాబు మీద ఎన్ని కేసులు వేస్తే ఆ కేసులకు స్టేలు తెచ్చుకోవడం, జడ్జిలతో మాట్లాడి స్టేలు తెప్పించుకోవడం చేశారు. ఇప్పుడు మీ బండారం మొత్తం బయటపడింది. 5 ఏళ్లకు సంబంధించి మీ డొంక అంతా కదిలితే వేల కోట్ల కుంభకోణం బయటికి వస్తుంది.

anil kumar yadav punch to lokesh and chandrababu

anil kumar yadav punch to lokesh and chandrababu

Anil Kumar Yadav : దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడటం లేదు?

దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలి. తల దొరికేసింది.. డొంక కదిలితే పచ్చ మీడియా, దత్త పుత్రుడు ఇలా అందరూ బయటపడే అవకాశం ఉంది. అందుకే మీరు ఎక్కడైనా దాక్కున్నారా? ప్యాంట్లు తడిసిపోతున్నాయా? అంటూ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.

YouTube video

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది