Bhuvaneswari : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఎంతలా అంటే.. టీడీపీ నేతలు, నందమూరి కుటుంబ సభ్యులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరూ రోడ్ల మీదికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్టే అని జబ్బలు చరుచుకుంటున్నారు. కానీ.. చంద్రబాబును అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ ముక్తకంఠంతో చెబుతున్నారు. రోడ్ల మీద నిరసనలు తెలుపుతున్నా పట్టించుకోవడం లేదు. తమకు అక్రమంగా డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదని.. తమకు కావాల్సినంత డబ్బు ఉందని.. ప్రజల కోసం ఆయన పాటుపడటం తప్పా.. అంటూ భువనేశ్వరి మండిపడ్డారు.
అమరావతి ప్రజల సొమ్మును తీసుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదని ఆమె అన్నారు. నేనే సొంతంగా ఒక సంస్థను నడుపుతున్నా. ఆ సంస్థలో రెండు శాతం వాటా అమ్మినా మాకు 400 కోట్లు వస్తాయి. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వందల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తారు. తనతో పాటు ప్రజలను కూడా ముందుకు తీసుకెళ్లడమే ఆయన లక్ష్యం. ఏం తప్పు చేశారని ఆయన్ను జైలులో పెట్టారు. ప్రజల కోసం ఆలోచించడమే ఆయన చేసిన తప్పా? నిరంతరం ప్రజల కోసమే చంద్రబాబు ఆరాటపడేవారు.. అని భువనేశ్వరి స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడిచారని, ఇప్పటికీ నడుచుకుంటన్నారన్నారు. రాళ్లతో కూడిన హైటెక్ సిటీ ప్రాంతాన్ని ఒక శిల్పంగా మార్చారన్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగులు వస్తుంటే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఏపీకి రావాలంటే పాస్ పోర్ట్, వీసా కావాలా అని మండిపడ్డారు. అలాగే.. చంద్రబాబుకు తినేందుకు జైలులో కనీసం టేబుల్ కూడా లేదు. చంద్రబాబుకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. తాజాగా ఆమె తన కోడలు నారా బ్రాహ్మణితో కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామిని భువనేశ్వరి దర్శించుకున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.