
Chandrababu : రాజ్యసభకు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని.. జూ.ఎన్టీఆర్‌కు చంద్రబాబు చెక్ ?
Chandrababu : నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుంది అని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచన చేస్తున్నట్లుగా సమాచారం. తద్వారా జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ చెప్పడంతో పాటు తెలంగాణలో టిడిపిని బలోపేతం చేసే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్ రావు ఎగువ సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి దారిలోనే కనీసం ఆరుగురు వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు బయటకు వెళ్లే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.వీరి రాజీనామాలను ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ ఆమోదించినట్లు రాజ్యసభ వర్గాలు తెలిపాయి. ఇద్దరూ మొదటిసారి రాజ్యసభ ఎంపీలు కాగా, వెంకటరమణ పదవీకాలం 2026లో ముగియాల్సి ఉండగా, మస్తాన్ 2028లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. వారి రాజీనామాల ఆమోదం రెండు స్థానాలకు ఉప ఎన్నికలకు మార్గం సుగమం చేసింది.
కనీసం ఆరుగురు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీలు బయటకు వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. వారిలో కొందరు టీడీపీలో చేరనుండగా, మరికొందరు బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఫిరాయింపులతో టీడీపీ మళ్లీ ఎగువసభలోకి అడుగుపెట్టనుంది.టీడీపీలో రాజ్యసభ ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర, పనబాక లక్ష్మి, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీ జనార్ధన్, వర్ల రామయ్య, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు వంటి నేతలు ఎంపీ పదవులను ఆశిస్తున్నారు.
Chandrababu : రాజ్యసభకు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని.. జూ.ఎన్టీఆర్‌కు చంద్రబాబు చెక్ ?
అయితే చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబానికి ఒక రాజ్యసభ పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ముఖ్యంగా హరికృష్ణ కుమార్తె సుహాసిని కి ఛాన్స్ ఇస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తెలంగాణ తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉన్నారు. పైగా హరికృష్ణ కుమార్తె. ప్రస్తుతం పార్టీ తో పాటు కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ దూరంగా ఉన్నారు. నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయని కూడా ఒక టాక్ నడుస్తోంది. అందుకే సుహాసిని కి రాజ్యసభ పదవి ఇస్తే తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ కు చెక్ పడినట్లు అవుతుంది. అదే సమయంలో తెలంగాణలో పార్టీకి ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఇటీవల తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తిరిగి క్రియాశీలం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ నేతలు దృష్టి సారించాలని సూచించారు.
Wife Killed Husband : ఇటీవల వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భర్త /భార్య ఉండగానే మరొకరితో సంబంధం పెట్టుకొని…
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో సామాన్యులకు 'బంగారం' గుదిబండగా మారిన సంగతి…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 22 టుడే ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలతో…
AP Pasu Bima Scheme 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుపోషణ అనేది వ్యవసాయం తర్వాత ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా ఆవులు,…
Onions for Diabetes : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మారుతున్న…
Pressure Cooker : ఇళ్లలో వంట పనిని సులభం చేసిన అద్భుతమైన పరికరం ప్రెషర్ కుక్కర్. తక్కువ సమయంలో వంట…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…
This website uses cookies.