YSRCP : ఆంధ్ర రాష్ట్రంలో Andhra pradesh Election 2024 అసెంబ్లీ ఎన్నికలు assembly election 2024 సమీపిస్తున్న వేళ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ఇటీవల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మూడు పార్టీల కూటమిలో జనసేన బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను పూర్తిగా ప్రకటించడం జరిగింది. ఇక పొత్తులో భాగంగా సీట్లు రాని టీడీపీ నాయకులు కొంతమంది వైసీపీలోకి వెళుతున్నారు. ఇక వైసీపీలో సీట్లు రాని కొంతమంది నాయకులు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అటు ఇటు రాజకీయ నాయకులు మారడం అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధారణంగా చోటు చేసుకునే పరిణామాలు. దీనిలో భాగంగానే మాజీ మంత్రి చంద్రబాబుకు చాలా సన్నిహితుడైన ఓ వ్యక్తి వైసీపీలోకి Ysrcp వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే విశాఖ జిల్లాలో జనసేనతో పొత్తు పెట్టుకోవడం వలన పలువురు టీడీపీ TDP సీనియర్లకు సీటు దక్కలేదు. దీంతో ఇప్పటికే పలువురు సీనియర్లు టీడీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.
మాజీ మంత్రులు బండారు శ్రీనివాసరావు Bandaru Srinivas , బండారు సత్యనారాయణ Bandaru Satyanarayana వంటి నేతలు చివరి నిమిషం వరకు సీట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఇక వారిలో బండారు సత్యనారాయణ నియోజకవర్గ నుండి పెందుర్తి స్థానం పొత్తు ఇప్పుడు జనసేనతో ఉండటంతో ఆ సీటు వారికి వెళ్ళిపోయింది. దీంతో అక్కడ సీటు ఆశించి నిరాశ చెందిన బండారు తో వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బండారును తమ పార్టీలోకి చేరాల్సిందిగా ఆఫర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బండారు కి అనకాపల్లి టికెట్ ఇస్తామని వైసీపీ నుండి హామీ దక్కినట్లు అయింది. ఇక వైసీపీ నుండి వచ్చిన హామీపై బండారు తన మద్దతుదారులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అసంతృప్తులను ఆయన చేరదీస్తున్నారని సమాచారం. ఇక వారందరితో చర్చలు జరిపిన తర్వాత వైసీపీ చేరే అవకాశం ఉన్నట్లుగా తేలుస్తోంది. అదేవిధంగా ఎంపీగా పోటీ చేసేందుకు బండారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ విషయంపై తాజాగా బండారు కూడా స్పందించడం జరిగింది. తాను తన మద్దతుదారులతో చర్చ జరుగుతున్నట్లుగా బండారు వెల్లడించారు. మరో రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని తెలియజేశారు. అయితే బండారు సత్యనారాయణకి చంద్రబాబుతో చాలా దగ్గర సన్నిహిత బంధం ఉందని చెప్పాలి. ఇక టీడీపీలో కూడా ఆయన సుదీర్ఘకాలం పనిచేయడం జరిగింది. అదేవిధంగా విశాఖ జిల్లాలో పార్టీ ముఖ్య నేతల్లో ఒకరిగా ఆయన వ్యవహరించారు. అయితే ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి అదీప్ రాజు జనసేన నుండి పచ్చగాల్ల రమేష్ బాబు పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా తాజాగా వైసీపీ పార్టీ విడుదల చేసిన ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో అనకాపల్లి ఎంపీ స్థానం మాత్రమే ఖాళీగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు బండారు అధికారికంగా వైసీపీ పార్టీలోకి చేరినట్లయితే ఆ సీటు అతనికి ఇచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది. దీంతో బండారి తో పాటు మరికొందరు నేతలు వైసీపీ పార్టీలకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో బండారు పార్టీ మార్పుపై ఆసక్తి నెలకొంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.