Home » Andhra Pradesh » Chandrababu To Give Ticket To Alekhya Reddy From Gudivada
andhra pradesh

Kodali Nani : కొడాలి నాని పైన అభ్యర్ధిగా చంద్రబాబు ఎవరిని దించాడో చూడండి..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: May 7, 2023, 9:00 am
Advertisement

Kodali Nani : ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం గురించి తెలుసు కదా. అక్కడ కొడాలి నాని పాతుకుపోయారు. ఏ పార్టీ అనే సంబంధం లేకుండా ఆయన ఈజీగా అక్కడ గెలుస్తారు. ఇప్పటికిప్పుడు అక్కడ ఎన్నికలు జరిగినా ఆయనే ఎమ్మెల్యే. అందుకే.. గుడివాడలో ఎలాగైనా ఈసారి కొడాలి నానిని ఓడించాలని టీడీపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. తమ పంతం నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉంది టీడీపీ.

Advertisement

నిజానికి గుడివాడ కొడాలి నానికి కంచుకోట. అక్కడ ఆయనకు తిరుగే లేదు. ఆ ధీమాతోనే టీడీపీ నాయకులపై ఆయన అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇష్టం ఉన్నట్టుగా తిడుతున్నారు. ఎలాగూ వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయం కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగానూ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అందుకే.. గుడివాడ నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

chandrababu to give ticket to alekhya reddy from gudivada

Advertisement

Kodali Nani : బలమైన అభ్యర్థిని బరిలోకి దించబోతున్న చంద్రబాబు

2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ పోటీ చేసినా కూడా గుడివాడలో టీడీపీ గెలవలేదు. అందుకే.. ఈసారి ఏకంగా నందమూరి వారసుడు దివంగత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని బరిలోకి దించాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారట. నందమూరి వారసుడు తారకరత్న అకాల మరణంతో నందమూరి అభిమానులు చాలా బాధలో ఉన్నారు. ఈనేపథ్యంలో ఆయన భార్య అలేఖ్య రెడ్డిని గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. యువగళం పాదయాత్ర ప్రారంభం రోజే తారకరత్నకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన చికిత్స పొందుతూ బెంగళూరు ఆసుపత్రిలో కన్నుమూశారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి