Ali – Pawan Kalyan : ఇన్నాళ్లు ఫ్రెండ్ అని ఊరుకున్న‌.. రేయ్‌ పవన్ కళ్యాణ్ నువ్వు జగన్ ని ఓడించేంత మగాడివా..!

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 18 January 2023, 3:10 pm

Ali – Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ pawan kalyan , ఏపీ మంత్రి రోజా roja  మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. మంత్ర రోజా.. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల శ్రీకాకుళంలో నిర్వహించిన సభలో మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా ఒక డైమండ్ రాణి అంటూ ఆరోపించారు. చివరకు రోజా కూడా మాట్లాడుతోంది అంటూ పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే.. వైసీపీ నేతలు చాలామంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ Ali  ఈ వ్యాఖ్యలపై స్పందించారు.

అలీ ప్రస్తుతం వైసీపీలో ఉన్న విషయం తెలిసిందే. సంక్రాంతి సంబురాల్లో నగరిలో పాల్గొన్న అలీ.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రోజాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి అలీని ప్రశ్నించగా.. డైమండ్ అనేది మంచి పదం. డైమాండ్ కు చాలా విలువ ఉంటుంది. రోజా గారు.. ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. కోహినూర్ డైమండ్ కు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలుసు.. అంటూ చెప్పుకొచ్చారు.

comedian ali comments on pawan kalyan go viral

comedian ali comments on pawan kalyan go viral

Ali – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తారా?

వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తారా? అని మరో మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు బదులుగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడ నిర్దేశిస్తే అక్కడ పోటీ చేసేందుకు తాను సిద్ధం అని అలీ చెప్పుకొచ్చారు. నగరిలో ఎమ్మెల్యేగా, మంత్రిగా రోజా చాలా అభివృద్ధి చేశారని అలీ కొనియాడారు. సినిమా వేరు, ఫ్యామిలీ వేరు, ఫ్రెండ్ షిప్ వేరు, రాజకీయాలు వేరని.. సినిమాలకు, రాజకీయాలను కలిపి చూడొద్దని అలీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అలీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి