
nimmagadda and chandrababu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ టీడీపీ పార్టీని ఆదుకోవటానికే వచ్చాడని నిన్న మొన్నటి దాక తెలుగు తమ్ములు భావించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల కమిషనర్ ను ఆకాశానికి ఎత్తేవాడు. అలాంటి బాబు ఇప్పుడు నిమ్మగడ్డ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు, అయితే నిజంగానే చంద్రబాబు హార్ట్ అయ్యి విమర్శలు చేస్తున్నాడా..? లేక ఏదైనా రాజకీయం వ్యూహంలో భాగంగా అనేది అర్ధంకావటం లేదు.
ఈ నేపథ్యంలో ఎస్ఈసీపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయా? అని ప్రశ్నించారు. ఎస్ఈసీ పరిధిలో ఉన్న అధికారాలను ఉపయోగించి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. న్యాయస్థానం ఆదేశాలను ఎన్నికల కమిషన్ ఎందుకు అమలు చేయలేదని బాబు నిలదీశారు. టీడీపీ ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఎస్‌ఈసీ చర్యలు తీసుకోలేదన్నారు. మరోపక్క ఎస్ఈసీ మాత్రం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని, అధికార యంత్రాంగం బాగా పనిచేసిందని మీడియా సమావేశంలో కితాబిచ్చారు.
అయితే రాష్ట్రంలో చంద్రబాబు అనుకున్న రేంజ్ లో టీడీపీకి అనుకూల ఫలితాలు రాకపోవటంతో ఆయనలో తీవ్ర అసహనం కనిపిస్తుంది. దీనితో ఓటమిని ఎస్ఈసీపై వేసి, తన ఫెయిల్యూర్‌ను కప్పి పుచ్చుకోవాలని తంటాలు పడుతున్నారనే విమర్శలున్నాయి. ఒకవైపు 40-50 శాతం పల్లెలను దక్కించుకున్నామని చెబుతూనే, మరోవైపు ఎస్ఈసీపై విమర్శలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఎస్ఈసీపై బాబు విమర్శలు ఉత్తుత్తివే అని వైసీపీ అంటోంది.
రాష్ట్రంలో బాబు అన్నట్లే అరాచక శక్తులు ఈ ఎన్నికలల్లో పెట్రేగిపోయాయని అనుకుంటే టీడీపీ నేతలు అన్నట్లు వైసీపీ మంత్రుల సొంత జిల్లాలో టీడీపీ సానుభూతి పరులు గెలిచేవాళ్ళు కాదు కదా.. ? అదే విధంగా చంద్రబాబు చెపుతున్న 40 -50 శాతం పల్లెలు కూడా టీడీపీ కి వచ్చేవి కాదు కదా..? ఒక కోణంలో ఏమో వైసీపీ కి పోటీగా విజయాలు సాధించామని చెపుతాడు, మరోపక్క ఏమో రాష్ట్రంలో అధికార పార్టీ బెదిరింపులకు దిగిందని, ఎస్ఈసీ సరిగ్గా ఎన్నికలు నిర్వహించలేదని ఆరోపణలు చేస్తాడు.. ఏమిటో బాబు రెండు నాల్గుల ధోరణి
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.