నిమ్మగడ్డ విషయంలో బాబును నమ్మటానికి లేదా..?

Authored By Brahma | The Telugu News | Updated on : 23 February 2021, 9:47 am

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ టీడీపీ పార్టీని ఆదుకోవటానికే వచ్చాడని నిన్న మొన్నటి దాక తెలుగు తమ్ములు భావించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల కమిషనర్ ను ఆకాశానికి ఎత్తేవాడు. అలాంటి బాబు ఇప్పుడు నిమ్మగడ్డ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు, అయితే నిజంగానే చంద్రబాబు హార్ట్ అయ్యి విమర్శలు చేస్తున్నాడా..? లేక ఏదైనా రాజకీయం వ్యూహంలో భాగంగా అనేది అర్ధంకావటం లేదు.

Chandrababu naidu

ఈ నేప‌థ్యంలో ఎస్ఈసీపై చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు స్వేచ్ఛాయుత వాతావర‌ణంలో జ‌రిగాయా? అని ప్ర‌శ్నించారు. ఎస్ఈసీ పరిధిలో ఉన్న అధికారాలను ఉపయోగించి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఆయ‌న గుర్తు చేశారు. న్యాయస్థానం ఆదేశాలను ఎన్నికల కమిషన్‌ ఎందుకు అమలు చేయలేదని బాబు నిలదీశారు. టీడీపీ ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఎస్‌ఈసీ చర్యలు తీసుకోలేదన్నారు. మరోపక్క ఎస్ఈసీ మాత్రం రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు విజ‌య‌వంతంగా ముగిశాయ‌ని, అధికార యంత్రాంగం బాగా ప‌నిచేసింద‌ని మీడియా స‌మావేశంలో కితాబిచ్చారు.

అయితే రాష్ట్రంలో చంద్రబాబు అనుకున్న రేంజ్ లో టీడీపీకి అనుకూల ఫలితాలు రాకపోవటంతో ఆయనలో తీవ్ర అసహనం కనిపిస్తుంది. దీనితో ఓట‌మిని ఎస్ఈసీపై వేసి, త‌న ఫెయిల్యూర్‌ను క‌ప్పి పుచ్చుకోవాల‌ని తంటాలు ప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఒక‌వైపు 40-50 శాతం ప‌ల్లెల‌ను ద‌క్కించుకున్నామ‌ని చెబుతూనే, మ‌రోవైపు ఎస్ఈసీపై విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. ఎస్ఈసీపై బాబు విమ‌ర్శ‌లు ఉత్తుత్తివే అని వైసీపీ అంటోంది.

రాష్ట్రంలో బాబు అన్నట్లే అరాచక శక్తులు ఈ ఎన్నికలల్లో పెట్రేగిపోయాయని అనుకుంటే టీడీపీ నేతలు అన్నట్లు వైసీపీ మంత్రుల సొంత జిల్లాలో టీడీపీ సానుభూతి పరులు గెలిచేవాళ్ళు కాదు కదా.. ? అదే విధంగా చంద్రబాబు చెపుతున్న 40 -50 శాతం పల్లెలు కూడా టీడీపీ కి వచ్చేవి కాదు కదా..? ఒక కోణంలో ఏమో వైసీపీ కి పోటీగా విజయాలు సాధించామని చెపుతాడు, మరోపక్క ఏమో రాష్ట్రంలో అధికార పార్టీ బెదిరింపులకు దిగిందని, ఎస్ఈసీ సరిగ్గా ఎన్నికలు నిర్వహించలేదని ఆరోపణలు చేస్తాడు.. ఏమిటో బాబు రెండు నాల్గుల ధోరణి

 

Advertisement

Brahma

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి