Ration Card : మహిళలకు గుడ్ న్యూస్. మీరు రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే ఎంచక్కా డబ్బులు సంపాదించుకునే అవకాశం వచ్చింది. ఇంటి దగ్గర నుండే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఎలా అంటే. పేదవారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు రేషన్ కార్డులను జారీ చేస్తుంటాయి. ప్రతినెల రేషన్ కార్డుల ద్వారా బియ్యం మరియు ఇతర సరుకులు కూడా పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. ఇదే మాత్రమే గాకా రేషన్ కార్డుతో మరెన్నో ప్రయోజనాలు కూడా అందుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డుతో ఇన్ని లాభాలు ఉండటం వలన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు తీసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే రేషన్ కార్డు ఉన్న మహిళలకు డబ్బు సంపాదించుకునే ఛాన్స్ వచ్చింది. రేషన్ కార్డు ఉంటే చాలు. ఇంటి వద్ద నుండి డబ్బులు సంపాదించుకోవచ్చు.
మహిళలు మీరు డబ్బు సంపాదించుకోవడానికి అందుబాటులో ఉన్నటువంటి మార్గాలను కూడా వెతుకుతున్నారు. అయితే మీకు గుడ్ న్యూస్. మీకు రేషన్ కార్డు ఉంటే చాలు. డబ్బు సంపాదించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు మాత్రమే ఈ సదవకాశం వచ్చింది. అయితే ఇది అందరికీ మాత్రం కాదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు మాత్రమే ఈ అవకాశం. ఈ జిల్లాలోని మహిళలకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఈ సదవకాశం కల్పించింది. ఏపీజీ పీ బ్యాంకుకు చెందినటువంటి స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు బ్యూటీ పార్లర్ కోర్సు ను ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మహిళలు వారి కాళ్ళ పై వారే నిలబడే విధంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా ఆ సంస్థ డైరెక్టర్ బి. శివప్రసాద్ తెలిపారు.
బ్యూటీ పార్లర్ కోర్సు నేర్చుకున్నట్లయితే మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈ రోజుల్లో అందానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కావున బ్యూటీ పార్లర్ కు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. అదేవిధంగా వివాహాలు మరియు ఇతర వేడుకలకు కూడా మరింత డిమాండ్ అనేది పెరిగింది. కాబట్టి బ్యూటీ పార్లర్ కోర్సులో శిక్షణ అనేది పొందినట్లయితే డబ్బు సంపాదనకు కొదవ అనేది ఉండదు.కావున గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని శివప్రసాద్ తెలిపారు. కాగా బ్యూటీ పార్లర్ ఉచిత ట్రైనింగ్ జూన్ 19 నుండి మొదలు అవుతుంది అని అధికారులు తెలిపారు. జూన్ 19వ తేదీ నుండి 30 రోజుల పాటు మహిళలకు బ్యూటీ పార్లర్ లో కోర్సులు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు. శిక్షణ అనేది పూర్తి అయిన తర్వాత కోర్సు పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. అలాగే ట్రైనింగ్ టైమ్ లో అభ్యర్థులకు ఉచిత హాస్టల్ వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, విద్యార్హత ధ్రువపత్రాలు కర్నూల్ లోని కెనరా బ్యాంకు వద్ద ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను సంప్రదించాలి అని తెలిపారు…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.