Honey Moon : వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో స్కూటీ అద్దెకు తీసుకుని పర్యటనకు వెళ్లిన ఈ జంట మే 23న కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మే 2న కొండ ప్రాంతంలో రాజా మృతదేహాన్ని కనుగొన్నారు. తొలుత సోనమ్ కూడా హత్యకు గురైందని అనుమానించారు. అయితే సంఘటనకు మలుపు తిప్పుతూ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో ఆమెను నలుగురు కిరాయి హంతకులతో పాటు అరెస్ట్ చేశారు.
Honey Moon : వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!
మేఘాలయ డీజీపీ ఐ. నోంగ్‌గ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజా హత్య వెనుక ఉన్నది ఎవరో కాదు, అతని భార్య సోనమే. ఆమె ముందుగానే మధ్యప్రదేశ్‌కి చెందిన కిరాయి హంతకులతో రాజా హత్యకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు గుర్తించారు. హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లడం, అక్కడ స్కూటీ అద్దెకు తీసుకుని కొండ ప్రాంతాలకు వెళ్లడం అంతా ముందస్తు ప్లాన్‌లో భాగమని వెల్లడించారు. సోనమ్‌పై నేరపూరిత కుట్ర, హత్యకు సహకరించిన నలుగురిపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసును సవాల్‌గా తీసుకున్న మేఘాలయ పోలీసులు కేవలం 7 రోజుల్లోనే సునిశిత దర్యాప్తు ద్వారా నిందితులను అదుపులోకి తీసుకుని మేజర్ బ్రేక్‌త్రూ సాధించారు. దీనిపై మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ట్విటర్ ద్వారా ప్రశంసలు తెలిపారు. రాజా హత్య కేసు ఇంకా కొన్ని కీలక మలుపులు తిరిగే అవకాశముందని పోలీసులు వెల్లడిస్తున్నారు. సోనమ్ ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టిందన్న విషయం ఇంకా అధికారికంగా బయటపడలేదు. త్వరలోనే నిందితులను మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.