Home » Health » Ranapala Plant Benefits
Health

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా… ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 9, 2025, 3:00 pm
Advertisement

Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ గుణాలను కలిగి ఉన్న మొక్కలను ఇంటి ఆవరణంలోనే పెంచుకుంటున్నారు. ఇకొందరైతే టెర్రస్ పైన ఒక వ్యవసాయమే చేస్తున్నారు. ఇంటి ఆవరణంలో పెంచుకునే మొక్కల్లో రణపాల మొక్క కూడా ఒకటి. దీనిలో ఔషధ గుణాలు బోలెడు. ఈ మొక్క శాస్త్రీయ నామం బ్రయో ఫిలం. ఈ రణపాలకు మొక్కను, ఎన్నో సంవత్సరాల నుంచి అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గించుటకు,దివ్య ఔషధంలా ఉపయోగిస్తున్నారు ఔషధ నిపుణులు.

Advertisement

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా…ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

ఈ మొక్క ఆకులు మందంగా, వగరు,పులుపు,రుచిని కలిగి ఉంటాయి. ఈ రణపాలక మొక్కలో,యాంటీ వైరల్,యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ రణపాలక మొక్కను ఉపయోగిస్తే,బిపి, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలోకి వస్తాయి. ఇంకా, మూత్రపిండాలలో రాళ్లను, మూత్ర సంబంధిత సమస్యలకు, ఈ రణపాలక మొక్క ఎంతో సహాయపడుతుంది.

Advertisement

సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు, అంటూ వ్యాధులు,గాయాలు, శ్వాస సంబంధిత సమస్యలు, ఉన్నవారికి రణపాలక మొక్క అద్భుత మూలికగా పనిచేస్తుంది. ఈ ఆకులతో టీ తయారు చేసుకోవచ్చు. ఈ టీ తాగితే తిమ్ముర్లు, ఉబ్బసం వంటి సమస్యలు కూడా నివారించవచ్చు. అంతేకాకుండా, ఈ మొక్క ఆకును పేస్టులా చేసి, లేపనంగా రాసుకుంటే,నడుము నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు కూడా నయమవుతాయి. మొలల సమస్యలతో బాధపడే వారికి, రణపాలక మొక్క ఆకుల్లో మిరియాలు కలిపి తీసుకుంటే, మొలల సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి