Husband Wife : అదృష్టం అంటే ఇదే.. భార్యాభర్తలు డిన్నర్‌కు వెళ్లి రూ.12.8 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారుగా ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Husband Wife : అదృష్టం అంటే ఇదే.. భార్యాభర్తలు డిన్నర్‌కు వెళ్లి రూ.12.8 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారుగా !

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Husband Wife : అదృష్టం అంటే ఇదే.. భార్యాభర్తలు డిన్నర్‌కు వెళ్లి రూ.12.8 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారుగా !

Husband Wife  : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భార్యాభర్తలకు అదృష్టం మాములుగా లేదు. కేవలం 3 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ. 257 విలువైన స్క్రాచ్ ఆఫ్ టికెట్‌తో వారికి ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.12.86 కోట్లు ద‌క్కాయి. సరదాగా హోటల్‌కు డిన్నర్‌కు వెళ్తుండగా.. ఆ మార్గంలో అనుకోకుండా కొనుగోలు చేసిన ఆ స్క్రాచ్ ఆఫ్ టికెట్‌ వారి ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.

Husband Wife అదృష్టం అంటే ఇదే భార్యాభర్తలు డిన్నర్‌కు వెళ్లి రూ128 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారుగా

Husband Wife : అదృష్టం అంటే ఇదే.. భార్యాభర్తలు డిన్నర్‌కు వెళ్లి రూ.12.8 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారుగా !

Husband Wife  : ల‌క్ అంటే ఇదే..

న్యూజెర్సీలోని నట్లీ ప్రాంతంలోని 397 సెంటర్ స్ట్రీట్‌లో ఉన్న లక్కీ 7 డెలిలో వైన్ ఫర్ లైఫ్.. స్క్రాచ్-ఆఫ్ టికెట్‌ను కొనుగోలు చేశారు. అయితే ఈ టికెట్ విజేతగా నిలవడంతో వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆ టికెట్‌ను స్క్రాచ్ చేసి చూడగా.. అదే మొదటి ప్రైజ్ దక్కించుకోవడం చూసి తాను నమ్మలేకపోయానని వారు చెప్పారు. అయితే ఆ దంపతులు మాత్రం తమ పేరు, అడ్రస్ చెప్పడానికి నిరాకరించారు.

వారు 10 డాలర్ల టికెట్‌తోపాటు రెండు 3 డాలర్ల విన్ ఫర్ లైఫ్ టికెట్లు కొన్నట్లు చెప్పారు. ఈ టికెట్ గెలుచుకోవడంతో తమ జీవితాలు పూర్తిగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ లాటరీలో వచ్చిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోకూడదని ఆ జంట నిర్ణయించుకుంది. ఏడాదికి కొంత చొప్పున మొత్తం 25 ఏళ్ల పాటు ఆ డబ్బు తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. న్యూజెర్సీ లాటరీ వెబ్‌సైట్ ప్రకారం వారు ఒకేసారి మొత్తం తీసుకుంటే అది 8.75 లక్షల డాలర్లు మాత్రమే వస్తాయని తెలుస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది