trs big shock to bjp over graduate mlc elections
తెలంగాణలో అధికారం చెలాయిస్తున్న కేసీఆర్ మరియు అతని కుటుంబ సభ్యుల మీద బీజేపీ నేతలు ఈ మధ్య కాలంలో తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ లాంటి నేతలు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన ఆస్తుల మీద సీబీఐ కి వెళ్తామని బెదిరింపులకు దిగిన సంగతి అందరికి తెలుసు.
తమ దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయని.. కోర్టులో పిటిషన్లు వేస్తామని బీజేపీ నేతలు చెప్పేవారు. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామనేవారు. కేసీఆర్ కు జైలు మాత్రమే మిగిలిందని హెచ్చరించేవారు. అయితే గ్రేటర్ ఎన్నికల తర్వాత.. కేసీఆర్ సైలెంట్ కావడంతో బండి సంజయ్ నోట.. కేసీఆర్ జైలు అనే మాటలు రావడం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు బీజేపీ వ్యవహారాల ఇన్చాజ్ తరుణ్ చుగ్ నేరుగా… కవితకు హెచ్చరికలు జారీ చేశారు.
సింగరేణి బెల్ట్‌లో పర్యటించిన తరుణ్ చుగ్.. అక్కడ కార్మిక యూనియన్లలో పట్టు పెంచుకున్న కవితను టార్గెట్ చేశారు. యూనియన్ లీడర్‌గా ఎమ్మెల్సీ కవిత అంతా తన చేతిలో పెట్టుకున్నారని.. ఎమ్మెల్సీ కవితకు తానిచ్చే మెసేజ్ ఒకటేనని.. దోపిడీ దొంగల్ని బీజేపీ ఎప్పుడూ వదిలిపెట్టలేదనేదేనని ఆయన చెప్పుకొచ్చారు. వదిలి పెట్టకుండా ఎలా పట్టుకుంటారంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర హోంశాఖ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.
నిజానికి గత కొద్దీ కాలంగా తెరాస నేతలెవరూ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కానీ, బీజేపీ మీద విమర్శలు చేసిన సందర్భాలు కానీ చాలా తక్కువ అనే చెప్పాలి. దీనితో బీజేపీ నేతలు కూడా పెద్దగా కేసీఆర్ గురించి కానీ, తెరాస పార్టీ గురించి ఈ మధ్య విమర్శలు చేయటం తగ్గించారు. ఇలాంటి దశలో తరుణ్ చుగ్ నేరుగా కవిత మీద విమర్శలు చేయటం చర్చనీయాంశం అయ్యింది.
అయితే బీజేపీ నేతల మాటలకూ తెరాస నేతలు కౌంటర్లు ఇస్తున్న కానీ వాటిలో పెద్దగా పస లేదనే చెప్పాలి. ఇక్కడ విశేషం ఏమిటంటే కవితను టార్గెట్ చేసి విమర్శలు చేసిన తరుణ్ చుగ్ మీద కాకుండా రొటీన్ విమర్శలు చేస్తున్న బండి సంజయ్ మీద ప్రభుత్వ విప్ సుమన్ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌పై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కొంచం మౌనంగా ఉంటున్న బీజేపీ పార్టీ మరోసారి సీబీఐ మంత్ర జపం చేస్తుంది…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
This website uses cookies.