Home » Entertainment » Sai Dharam Tej Is In Race
Entertainment

Sai dharam tej : సాయిధరమ్ తేజ్ బరిలో దిగబోతున్నాడు.. ఎవరికి చెక్ పెడతాడో చూడాలి..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: March 8, 2021, 1:31 pm
Advertisement

Sai dharam tej : సాయిధరమ్ తేజ్ వరసగా హిట్స్ కొడుతూ మంచి ఫాంలో ఉన్నాడు. చిత్రలహరి, ప్రతీరోజు పండుగే సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సాయిధరమ్ తేజ్ రీసెంట్ గా సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమాతో హ్యాట్రిక్ అందుకున్నాడు. కరోనా లాక్ డౌన్ తర్వాత సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో వచ్చి ఇండస్ట్రీలో అందరికీ ధైర్యాన్ని ఇచ్చాడు. కాగా ఈ సినిమా తర్వాత వెంటనే మరో ప్రాజెక్ట్ ని మొదలు పెట్టిన సాయిధరమ్ తేజ్ ఈ సినిమా షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసి షాకిచ్చాడు.

Advertisement

sai-dharam-tej is in race

టాలెంటెడ్ డైరెక్టర్ దేవా కట్ట దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా చేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్ తోనే సినిమా మీద మంచి అంచనాలను పెంచారు. ఈ సినిమాను జేబి ఎంటర్టైన్మెంట్స్ జీ స్టూడియోస్ బ్యానర్లపై భగవాన్ పుల్లారావు నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటిస్తోంది. కాగా దర్శకుడు దేవా కట్టా ఈ సినిమా నుంచి తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. ఇటీవలే మా సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. కేవలం 64 రోజుల్లో ఎలాంటి కరోనా కేసులు లేకుండా పూర్తి చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు.

Advertisement

Sai dharam tej : సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సమ్మర్ లోపే రిలీజ్..?

దాంతో ఈ సినిమా సమ్మర్ లోపే రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాల రిలీజ్ డేట్ లాకయ్యాయి. యంగ్ హీరోలు నటిస్తున్న సినిమాలతో పాటు సీనియర్ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల రిలీజ్ డేట్ లాకవడంతో ఇప్పుడు సాయిధరమ్ తేజ్ తన రిపబ్లిక్ సినిమాతో ఎవరికి చెక్ పెట్టడానికి రెడీ అవుతున్నాడో అన్న ఆసక్తి మొదలైంది. చూడాలి మరి మేకర్స్ ఏ నెలలో సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాని రిలీజ్ కి ప్లాన్ చేస్తారో. ఇక ఈ సినిమాలో జగపతిబాబు రమ్యకృష్ణ కీలక పాత్రలలో నటించారు. త్వరలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ ని మొదలు పెట్టడం తో పాటు టీజర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి