Vanga Geetha : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ కావడం సర్వ సాధారణం అయిపోయింది. ఇప్పుడు వంగా గీత విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. వంగా గీత పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టారు. అసలు వంగా గీత నిజంనేగానే జనసేనలో చేరుతున్నారా? ఆమెకు ఆ అవసరం ఉందా అంటూ ప్రచారం జరుగుతోంది. వంగా గీత విషయంలో మొదటనే పవన్ కల్యాన్ తన అభిప్రాయం ఏంటో చెప్పేశారు. ఆమె చాలా మంచి నాయకురాలని అభినందించారు. అంతే కాకుండా ఆమె రాజకీయ జీవితం ప్రజారాజ్యం పార్టీతోనే ప్రారంభమైందని గుర్తుచేశారు.
ఆమె కూడా త్వరలోనే జనసేనలో చేరుతారంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. ఇప్పుడు పోలింగ్ కు కొన్ని రోజుల ముందు నుంచే చాలా మంది వైసీపీ నేతలు టీడీపీ కూటమిలో చేరుతున్నారు. ఇప్పటికే పై స్థాయి నేతల నుంచి కింది స్థాయి నేతల వరకు చాలా మంది జనసేనలో చేరారు. 150కి పైగా సీట్లు గెలుస్తున్నామని జగన్ చెబుతున్నా కింది స్థాయిలో గ్రౌండ్ లెవల్లో ఆ పరిస్థితులు కనిపించట్లేదు. దాంతో పాటు ఇటు కూటమి సభ్యులు కూడా తామే అధికారంలోకి వస్తున్నామని చెబుతున్నారు. 120కి పైగా సీట్లు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది వైసీపీని వీడేందుకు రెడీ అవుతున్నారు. కూటమిలోని టీడీపీ లేదా జనసేనలో చేరేందుకు వారంతా సిద్ధం అవుతున్నారు.
ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే తమ బెర్త్ లను ముందే కన్ఫర్మ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ పని చేస్తున్నారు. ఇందులో భాగంగానే వంగా గీత పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయమని.. మెజార్టీ పైనే అంచనాలు ఉన్నాయంటున్నారు. పైగా వంగా గీతకు గతంలో చిరంజీవి కుటుంబంతో ఎంతో అనుంబంధం ఉంది. మొన్న ఓ ఛానెల్ లో మాట్లాడుతూ తనకు చిరంజీవి అంటే అభిమానం అని, పవన్ ను ఎప్పుడూ విమర్శించలేదంటూ తెలిపింది. భవిష్యత్ లో కూడా విమర్శించబోనంటూ చెప్పారు. దాంతో ఆమె చేసిన వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ పార్టీలో త్వరలోనే వంగా గీత చేరుతారంటూ ప్రచారం ఊపందుకుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.