JC Prabhakar Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. అందుకే ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పేరే బలంగా వినిపిస్తోంది. చివరకు సీఎం రేస్ లోనూ ఆయన పేరే తొలి నుంచి వినిపించింది. చివరకు ఆయన్నే అధిష్ఠానం కూడా సీఎంగా ఖరారు చేసింది. ఇక.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై తాజాగా ఏపీ రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. దానికి కారణం.. రేవంత్ రెడ్డి.. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వ్యక్తి కావడం.. టీడీపీలో చాలా ఏళ్ల పాటు పని చేసిన వ్యక్తే కావడంతో రేవంత్ రెడ్డి గురించి టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి.. చంద్రబాబు శిష్యుడు. ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే చంద్రబాబు అంటుంటారు. ఆయన రావడం వల్ల.. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలు తీరుతారు. ఖచ్చితంగా చంద్రబాబు ఇక్కడ గెలిచిన తర్వాత చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. నీటి సమస్యలు అన్నీ తీరుతాయి అని జేసీ తెలిపారు.
ఏపీలో బాగా పాలన ఎవరు చేస్తారు అంటే వాళ్లకే మా ఓటు. మాకు కనిపించేది చంద్రబాబు మాత్రమే. అందుకే చంద్రబాబుకు జై అంటున్నాం. ఇప్పుడు మాకు ఉన్న ప్రత్యామ్నాయం చంద్రబాబు మాత్రమే అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉండటం వల్ల కాంగ్రెస్ గెలిచింది. ఆంధ్రాలో కూడా వైసీపీపై వ్యతిరేకత వచ్చింది. అందుకే తెలంగాణలో ఇప్పుడు ఏం జరిగిందో అదే త్వరలో ఏపీలోనూ జరగబోతోంది. అక్కడ బీఆర్ఎస్ ను ప్రజలు వ్యతిరేకించారు. ఇక్కడ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఓడించబోతున్నారు ప్రజలు అంటూ జేసీ చెప్పుకొచ్చారు.
చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ కలిసి రెండు రాష్ట్రాలను ఎలాంటి సమస్యలు లేకుండా పాలించుకుంటారని.. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు ఇక రావని జేసీ స్పష్టం చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతుండటంతో ఇక ఏపీలో టీడీపీకి కాస్త బూస్ట్ అనే చెప్పుకోవాలి. తెలంగాణ విషయంలో ఏపీకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.