JC Prabhakar Reddy : రేవంత్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు.. చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ కలిసిపోతారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

JC Prabhakar Reddy : రేవంత్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు.. చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ కలిసిపోతారు

JC Prabhakar Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. అందుకే ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పేరే బలంగా వినిపిస్తోంది. చివరకు సీఎం రేస్ లోనూ ఆయన పేరే తొలి నుంచి వినిపించింది. చివరకు ఆయన్నే అధిష్ఠానం కూడా సీఎంగా ఖరారు చేసింది. ఇక.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై తాజాగా ఏపీ రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :4 December 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  రేవంత్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే ఏపీకే మేలు

  •  చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ కలిసిపోతారు

  •  రెండు రాష్ట్రాలు బాగుపడతాయి

JC Prabhakar Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. అందుకే ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పేరే బలంగా వినిపిస్తోంది. చివరకు సీఎం రేస్ లోనూ ఆయన పేరే తొలి నుంచి వినిపించింది. చివరకు ఆయన్నే అధిష్ఠానం కూడా సీఎంగా ఖరారు చేసింది. ఇక.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై తాజాగా ఏపీ రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. దానికి కారణం.. రేవంత్ రెడ్డి.. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వ్యక్తి కావడం.. టీడీపీలో చాలా ఏళ్ల పాటు పని చేసిన వ్యక్తే కావడంతో రేవంత్ రెడ్డి గురించి టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి.. చంద్రబాబు శిష్యుడు. ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే చంద్రబాబు అంటుంటారు. ఆయన రావడం వల్ల.. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలు తీరుతారు. ఖచ్చితంగా చంద్రబాబు ఇక్కడ గెలిచిన తర్వాత చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. నీటి సమస్యలు అన్నీ తీరుతాయి అని జేసీ తెలిపారు.

ఏపీలో బాగా పాలన ఎవరు చేస్తారు అంటే వాళ్లకే మా ఓటు. మాకు కనిపించేది చంద్రబాబు మాత్రమే. అందుకే చంద్రబాబుకు జై అంటున్నాం. ఇప్పుడు మాకు ఉన్న ప్రత్యామ్నాయం చంద్రబాబు మాత్రమే అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉండటం వల్ల కాంగ్రెస్ గెలిచింది. ఆంధ్రాలో కూడా వైసీపీపై వ్యతిరేకత వచ్చింది. అందుకే తెలంగాణలో ఇప్పుడు ఏం జరిగిందో అదే త్వరలో ఏపీలోనూ జరగబోతోంది. అక్కడ బీఆర్ఎస్ ను ప్రజలు వ్యతిరేకించారు. ఇక్కడ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఓడించబోతున్నారు ప్రజలు అంటూ జేసీ చెప్పుకొచ్చారు.

JC Prabhakar Reddy : చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ కలిసి రెండు రాష్ట్రాలను పాలిస్తారు

చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ కలిసి రెండు రాష్ట్రాలను ఎలాంటి సమస్యలు లేకుండా పాలించుకుంటారని.. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు ఇక రావని జేసీ స్పష్టం చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతుండటంతో ఇక ఏపీలో టీడీపీకి కాస్త బూస్ట్ అనే చెప్పుకోవాలి. తెలంగాణ విషయంలో ఏపీకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది