Jr NTR : చంద్రబాబు విషయంలో తెగించేసిన జూనియర్ ఎన్టీఆర్..!!
Jr NTR : చంద్రబాబు అరెస్టు పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం సంచలనంగా మారింది. చంద్రబాబు అరెస్టుని తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి కుటుంబ సభ్యులు ఖండిస్తూ వస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఎందుకు ఈ విషయంలో ఎన్టీఆర్ సైలెంట్ గా ఉన్నారు అనేది ప్రతి ఒక్కరి మదిలో ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందించకపోవటానికి కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్.. స్పందిస్తూ చంద్రబాబు అరెస్ట్ విషయమై టాలీవుడ్ లో పవన్, బాలయ్య, రాఘవేంద్రరావు సహాయం ఇతర సినీ పెద్దలు.. స్పందించగా.. మిగతా వాళ్ళు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే తాజా పరిణామాలు బట్టి ఇంకా బాబుకి బెయిల్ వచ్చే ప్రసక్తి లేని తారక్ ఫిక్స్ అయిపోయారట. ఈ విషయాని అధికార పార్టీలో తనకి అత్యంత సన్నిహితులు చెప్పడం జరిగిందట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇకపై స్పందిస్తారనేది కూడా ఎవరికీ నమ్మకం లేదు. గతంలో ఎన్టీఆర్ తన చివరి రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ప్రకటనలు చేశారు. కానీ చంద్రబాబు అరెస్టు విషయమై ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ స్పందించలేదు. 2009 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ నీ వాడుకుని పక్కన పెట్టేయటం మాత్రమే కాదు హరికృష్ణ అన్ని చాలాసార్లు చంద్రబాబు అవమానించిన సందర్భాలు ద్రష్ట్యా తారక్ నోరు మెదపడం లేదట.
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి క్లైమాక్స్ కి చేరుకోవడంతో పాటు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు… ఇచ్చిన నేపథ్యంలో.. ఎన్టీఆర్ ఇక పూర్తిగా చంద్రబాబు అరెస్ట్ లైట్ తీసుకున్నట్లు సమాచారం. ఇంక ఎవ్వరు ఎన్ని సూటి పోటీ మాటలు అన్న తెగించి ఈ విషయంలో అసలు మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.