kadiyam srihari talks about brs party after results
Kadiyam Srihari : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతోంది. 119 సీట్లకు గాను 64 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లకే పరిమితం అయింది. అందులో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గెలుపొందారు. ఇదివరకు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత స్టేషన్ ఘనపూర్ టికెట్ ను కేసీఆర్.. కడియంకు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ వేవ్ లోనూ ఘనపూర్ లో కడియం శ్రీహరి గెలిచి చూపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కడియం నియోజకవర్గ ప్రజలతో మాట్లాడారు. పార్టీ అధికారంలోకి రాలేదని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మళ్లీ ఆరు నెలలు, సంవత్సరం, రెండు సంవత్సరాలు అని చెప్పలేం కానీ.. మళ్లీ ప్రభుత్వం మనదే. మన ముఖ్యమంత్రి కేసీఆరే.. కాంగ్రెస్ పార్టీకి బోటాబోటి మెజారిటీ వచ్చింది. దాన్ని కాపాడుకుంటారో లేదో మనం చూడాలి అని కడియం శ్రీహరి అన్నారు.
ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును మనమంతా గౌరవించాలి. ప్రతిష్టమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. అంతే కాకుండా.. తెలంగాణ ప్రజల హక్కులకు ఎక్కడా భంగం కలిగినా మేము ఊరుకోం అన్నారు కడియం శ్రీహరి. కడియం మాటలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే 64 మంది ఎమ్మెల్యేలు. అందులో కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. రాజీనామా చేసినా ప్రభుత్వం పడిపోతుంది. అంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఎప్పుడైనా పడిపోయే చాన్స్ ఉంది. దాన్ని బీఆర్ఎస్ అవకాశంగా తీసుకుంటుందా? కడియం చెప్పిన మాటలు దానికే నిదర్శనంగా కనిపిస్తున్నాయా అనేది తెలియడం లేదు.
ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 39. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే.. ఇంకా 21 మంది ఎమ్మెల్యేలు కావాలి. అందులో ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు. 21 లో 7 తీసేస్తే.. ఇంకా కావాల్సింది 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. బీజేపీ చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, ఒక్క సీపీఐ.. మొత్తం 9 మందిని తమ వైపు లాక్కున్నా ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు కావాలి. ఆ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే.. అటు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది.. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ ను సాధిస్తుంది. కొంపదీసి బీఆర్ఎస్ పెద్దలు ఇలాంటి ప్లాన్స్ ఏమైనా వేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది కడియం శ్రీహరి మాటలు వింటే. చూద్దాం ఏం జరుగుతుందో.
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్‌తో మార్కెట్‌ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
This website uses cookies.