
Kethireddy : చంద్రబాబు సీఎంగా ఉంటె రాష్ట్రానికి కరువే.. కేతిరెడ్డి
Kethireddy : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులే మారిపోయాయని, ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో వర్షాభావం రావడం వంటి విచిత్రమైన పరిణామాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. రైతులు ఒక్క పంటకూ వేయలేని పరిస్థితి ఏర్పడిందని, చంద్రబాబు హయాంలో పంట వేస్తే అది నాశనం అని ఆయన విమర్శించారు.
Kethireddy : చంద్రబాబు సీఎంగా ఉంటె రాష్ట్రానికి కరువే.. కేతిరెడ్డి
చంద్రబాబు ఎన్నడూ చేయనివి కూడా చేశానని గొప్పలు చెప్పుకుంటారని, ఆయన పాలనలో గిన్నిస్ బుక్ రికార్డులు తప్ప నిజమైన అభివృద్ధి కనబడలేదని కేతిరెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిందనేదే చెప్పుకోలేకపోతున్న పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి బ్రహ్మరథం పడుతున్నదని, కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని తెలిపారు. వైసీపీ నేతలపై కేసులు పెడుతూ రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
వైఎస్ జగన్ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్నారని, ఆయన పర్యటనల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారని కేతిరెడ్డి అన్నారు. జగన్‌ను అడ్డుకునేందుకు వేలాదిగా పోలీసులను రంగంలోకి దించడమే ప్రస్తుత ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు. మహిళల ఉచిత బస్సు పథకం పేరు చెప్పి గందరగోళం సృష్టిస్తున్నారని, బస్సుల్లో ఎక్కిస్తారేమో అని సంతోషపడే మహిళలను మధ్యం దించేస్తారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహపడకూడదని, ప్రజల్లో మద్దతు తమకే ఉన్నదని ధైర్యం ఇచ్చారు. ప్రజల సమస్యలపై కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.