Kethireddy : చంద్రబాబు సీఎంగా ఉంటె రాష్ట్రానికి కరువే.. కేతిరెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kethireddy : చంద్రబాబు సీఎంగా ఉంటె రాష్ట్రానికి కరువే.. కేతిరెడ్డి

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ కేతిరెడ్డి సెటైర్లు

  •  Kethireddy : చంద్రబాబు సీఎంగా ఉంటె రాష్ట్రానికి కరువే.. కేతిరెడ్డి

Kethireddy  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులే మారిపోయాయని, ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో వర్షాభావం రావడం వంటి విచిత్రమైన పరిణామాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. రైతులు ఒక్క పంటకూ వేయలేని పరిస్థితి ఏర్పడిందని, చంద్రబాబు హయాంలో పంట వేస్తే అది నాశనం అని ఆయన విమర్శించారు.

Kethireddy చంద్రబాబు సీఎంగా ఉంటె రాష్ట్రానికి కరువే కేతిరెడ్డి

Kethireddy : చంద్రబాబు సీఎంగా ఉంటె రాష్ట్రానికి కరువే.. కేతిరెడ్డి

Kethireddy : డప్పు వేసుకోవడంతో చంద్రబాబు తర్వాతే ఎవరైనా – కేతిరెడ్డి

చంద్రబాబు ఎన్నడూ చేయనివి కూడా చేశానని గొప్పలు చెప్పుకుంటారని, ఆయన పాలనలో గిన్నిస్ బుక్ రికార్డులు తప్ప నిజమైన అభివృద్ధి కనబడలేదని కేతిరెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిందనేదే చెప్పుకోలేకపోతున్న పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి బ్రహ్మరథం పడుతున్నదని, కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని తెలిపారు. వైసీపీ నేతలపై కేసులు పెడుతూ రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వైఎస్ జగన్ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్నారని, ఆయన పర్యటనల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారని కేతిరెడ్డి అన్నారు. జగన్‌ను అడ్డుకునేందుకు వేలాదిగా పోలీసులను రంగంలోకి దించడమే ప్రస్తుత ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు. మహిళల ఉచిత బస్సు పథకం పేరు చెప్పి గందరగోళం సృష్టిస్తున్నారని, బస్సుల్లో ఎక్కిస్తారేమో అని సంతోషపడే మహిళలను మధ్యం దించేస్తారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహపడకూడదని, ప్రజల్లో మద్దతు తమకే ఉన్నదని ధైర్యం ఇచ్చారు. ప్రజల సమస్యలపై కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది