
#image_title
Kethireddy : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు గురించే, చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఆరోగ్యం పాడయిందని.. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని చాలా వార్తలు వస్తున్నాయి. అయితే.. అందులో నిజం ఏమాత్రం లేదని.. చంద్రబాబు అరోగ్యం గురించి తాజాగా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందించారు. రెండు మూడు రోజుల నుంచి చంద్రబాబు అరోగ్య పరిస్థితి గురించి చాలా వార్తలు వస్తున్నాయి. ట్విట్టర్ వేదికగా ఆయన భార్య, కోడలు, కొడుకు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కోర్టుల్లో వేరే కేసు తీసుకోవడం లేదు. ఈ కేసు గురించే విచారణ నడుస్తోంది. దాని వల్ల.. చాలామందికి ఇబ్బంది అవుతోంది.. అంటూ కొందరు వాదిస్తున్నారు. కొన్ని చానెల్స్, పత్రికలు కూడా అదే పనిగా రాస్తున్నాయి. కొందరు ధర్నాలు చేయడం కూడా జరుగుతోంది. దీని గురించి నేను ముందే చెప్పాను. ముఖ్యంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ అంటే ఏంటి? దాంట్లో ఏవిధంగా మోసం చేశారు. ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనే దాని గురించి కూడా మాట్లాడాను. హైదరాబాద్ వెళ్లినప్పుడు కూడా నేను హైటెక్ సిటీ గురించి కొన్ని విన్నాను.. అంటూ కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఫస్ట్ నుంచి రూమర్స్, కాంట్రవర్సీ మీదనే చంద్రబాబు లైఫ్ నడుస్తూ వచ్చింది. అప్పట్లో వాళ్ల మామ ఎన్టీఆర్ ను దింపడం దగ్గర్నుంచి పార్టీని లాక్కోవడం.. అన్నీ అబద్ధాల మీద నిచ్చెనలు వేసుకుంటూ వచ్చి జీవితం ఆయనది. ఆయన్ను నంద్యాలలో అరెస్ట్ చేసినప్పుడు ఇది అక్రమ అరెస్ట్ అన్నారు. ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అన్నారు. అరెస్ట్ చేస్తూనే వెంటనే హెలికాప్టర్ లో తీసుకెళ్తాం అంటే.. రోడ్డు మీద వెళ్తా అన్నాడు. రిమాండ్ కు పంపిస్తే దాని గురించి పెద్ద వాదనలు. ఇప్పటికి కూడా సుప్రీం, హైకోర్టు, ఇతర కోర్టుల్లో ఇవే వాదనలు. 17ఏ మీదనే వాదనలు నడుస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెబితే దోమలు కుడుతున్నాయి అన్నారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లు నెట్ ప్రొవైడ్ చేశారు. హాట్ వాటర్ ఇచ్చారు. ఎనిమిది ఫ్యాన్స్ ఇచ్చారు. తినడానికి టేబుల్ లేదు అన్నారు. జైలర్ ఏదో సెలవులో వెళ్తే కూడా చంద్రబాబు ప్రాణానికి రక్షణ లేదు అన్నారు. ప్రతి సందర్భాన్ని కూడా అబద్ధాల మీదనే నడుపుకుంటూ వచ్చారన్నారు కేతిరెడ్డి.
#image_title
ఇప్పుడు కొత్తగా చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ అంటూ చెబుతున్నారు. చంద్రబాబుకు స్కిన్ ఎలర్జీ ఉన్న విషయం అందరికీ తెలుసు. దాని వల్ల 5 కిలోలు తగ్గినాడు అని అంటున్నారు. లేదు ఆయన ఒక కేజీ పెరిగాడు. తగ్గలేదు అని జైళ్ల శాఖ డీజీ క్లారిటీ ఇచ్చారు. మళ్లీ దాని మీద అంతా కూడా న్యూసెన్స్ చేస్తున్నారు. మనం స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నామా? లోకేష్ వాళ్ల నాన్న కంటే 10 ఇంతలు ఎక్కువే ఉన్నాడు అబద్ధాలు చెప్పడంలో. మామూలుగా దీనిలో ఒక కేసు పడగానే ఢిల్లీకి వెళ్లిపోయాడు. మళ్లీ వచ్చాడు. అమిత్ షా దగ్గర అపాయింట్ మెంట్ తీసుకోలేదు అన్నాడు చివరకు అమిత్ షాను కలిశాడు.. ఇవన్నీ ఎందుకు అంటూ నారా లోకేష్, చంద్రబాబుపై కేతిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.