Home » Andhra Pradesh » Kodali Nani Explanation On Chiranjeevi
andhra pradesh

Kodali Nani : పకోడీ గాళ్లు అని చిరంజీవిని నేను అనలేదు కొడాలి నాని వివరణ.. వీడియో !!

Authored By
Breaking News
The Telugu News | Published on: August 22, 2023, 6:40 pm
Advertisement

Kodali Nani : గుడివాడ నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి వేడుకలలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను పకోడీ గాళ్లు అని విమర్శలు చేసింది.. చిరంజీవి ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. చిరంజీవిని విమర్శించినట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని ఖండించారు. చిరంజీవిని విమర్శించినట్లు నిరూపించాలని సవాల్ కూడా విసిరారు. తాను ఏం మాట్లాడాను చిరంజీవి మరి ఆయన అభిమానులకు తెలుసని చెప్పుకొచ్చారు.

Advertisement

చిరంజీవి అభిమానులకు క్లారిటీ ఉందని పేర్కొన్నారు. రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసని స్పష్టం చేశారు. ఎవరి జోలికి వెళ్ళని చిరంజీవిని విమర్శించే అంత సంస్కారహీనుడిని కాదని అన్నారు. “చిరంజీవి అభిమానుల ముసుగులో తెలుగుదేశం మరియు జనసేన పార్టీ శ్రేణులు గుడివాడ రోడ్లపై దొర్లారు. చిరంజీవికి తమకి మధ్య గ్యాప్ సృష్టించాలని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తాం.

kodali nani explanation on Chiranjeevi

Advertisement

మాకు ఇచ్చినట్లు డ్యాన్సులు నటన చేతగాని ఇండస్ట్రీలో పకోడీగాలకి కూడా చిరంజీవి సలహాలు ఇవ్వాలని తాను తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రీలో డాన్స్ ఇంకా నటన పరంగా చిరంజీవి ఓ శిఖరం. అటువంటి నటుడు గురించి నేను.. డాన్సులు యాక్షన్ రావని ఎలా మాట్లాడుతాను అని ప్రశ్నించారు. అదేవిధంగా తన వెంట ఉన్న వారిలో 60 శాతం మంది చిరంజీవి అభిమానులే అని కొడాలి నాని స్పష్టం చేశారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి