Home » News » Kodi Kathi Srinu To Do Hunger Strike
News

Kodi Kathi Seenu : పెద్ద ప్లాన్ తోనే రంగంలోకి దిగిన కోడికత్తి శ్రీను – వైసీపీ ఎక్కడా తగ్గేదే లే !

Authored By
Breaking News 2
The Telugu News | Published on: July 6, 2023, 2:00 pm
Advertisement

Kodi Kathi Seenu : కోడి కత్తి శ్రీను మీకు గుర్తున్నాడా? 2019 ఎన్నికల ముందు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో లాంజ్ లో కోడికత్తితో దాడి చేసిన విషయం తెలుసు కదా. ఆ దాడి వెనుక ఉన్నది టీడీపీ నేతలే అని అప్పటి నుంచి వైసీపీ ఆరోపణలు చేస్తోంది. కానీ.. అదంతా ఉత్త డ్రామా అని.. అది పీకే ప్లాన్ లో భాగం అని.. దానిలో భాగంగానే దాడి జరిగిందని కూడా టీడీపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలకు. అయితే.. శ్రీను వెర్షన్ మాత్రం మరో విధంగా ఉంది. అయితే.. ఇప్పటికీ శ్రీను జైలులోనే ఉన్నాడు. అసలు ఆయనపై నేరం రుజువు కాలేదు. కానీ.. దాదాపు ఐదేళ్ల నుంచి జైలులోనే మగ్గుతున్నాడు శీను.

Advertisement

అప్పట్లో శ్రీనుకు ఎన్ఐఏ కోర్టు బెయిల్ ఇచ్చింది కానీ.. మళ్లీ ఆ బెయిల్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. కానీ.. శ్రీనుకు బెయిల్ ఇవ్వలంటూ ఆయన తరుపు న్యాయవాది తాజాగా ఎన్ఐఏ కోర్టులో వాదనలు వినిపించారు. ఈనేపథ్యంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టు పలు కీలక వ్యాఖ్యలను చేసింది. బెయిల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. బెయిల్ కావాలంటే సుప్రీంను ఆశ్రయించాలని తెలిపింది. దీంతో ఈ కేసు విచారణ జులై 11కు వాయిదా పడింది.తన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కావాలని తన కేసు విచారణను జాప్యం చేస్తున్నారని.. జైలులోనే నిరాహార దీక్ష చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జులై 11 నుంచి జైలులోనే దీక్ష చేసేందుకు శీను సంసిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

kodi kathi srinu to do hunger strike

Advertisement

Kodi Kathi Seenu : బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో శ్రీను షాకింగ్ నిర్ణయం

శీను జైలులో దీక్ష చేసేందుకు సిద్ధం అవుతున్నాడని శీను తరుపు లాయర్ అబ్దుల్ సలీం చెప్పుకొచ్చారు. 5 ఏళ్ల నుంచి శీను జైలులోనే ఉన్నాడని, అందుకే కోర్టు ఆయనకు రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. ఒకవేళ షెడ్యూల్ ప్రకటించకుంటే తను జైలులోనే నిరాహార దీక్ష చేస్తానని అన్నారని చెప్పుకొచ్చారు. చూద్దాం మరి ఈ కోడి కత్తి కేసు ఇంకెంత దూరం వెళ్తుందో?

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి