Home » Exclusive » Komatireddy Rajagopal Reddy Rushes To Nomination In The Last Minute
Exclusive

Komatireddy Rajagopal Reddy : ర్యాలీ హడావుడిలో పడి నామినేషన్ వేయడం మరిచిపోయిన కోమటిరెట్టి.. చివరి నిమిషంలో ఎలా పరిగెత్తాడో చూడండి

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: November 9, 2023 8:53 pm
Advertisement

Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలుసు కదా. ఆయన ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడులో ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని.. అధికార బీఆర్ఎస్ పార్టీ నిధులు కేటాయించడం లేదని.. కాంగ్రెస్ లో కూడా హైకమాండ్ అస్సలు పట్టించుకోవడం లేదని.. తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. వెంటనే అక్కడ ఉపఎన్నిక రావడంతో బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డికి టికెట్ లభించింది. కానీ.. ఆ ఉపఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత 2023 ఎన్నికల ముందు అంటే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ నుంచి తనకు స్పష్టమైన టికెట్ హామీ రాకపోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి గాలి వీస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్.. రాజగోపాల్ రెడ్డికి మళ్లీ మునుగోడు నుంచే టికెట్ ప్రకటించింది.

Advertisement

దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. గత కొన్ని రోజుల నుంచి మునుగోడులోనే మకాం వేశారు. నియోజకవర్గ స్థాయి నేతలు కూడా మునుగోడులోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున రోజూ నియోజకవర్గం అంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇవాళ కూడా ప్రచారంలో మునిగిపోయారు. అయితే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేయడమే మరిచిపోయారు. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10 వరకే. అంటే రేపే చివరి తేదీ. రేపటి లోగా నామినేషన్స్ వేయాల్సి ఉంది. అందుకే ఇవాళ నామినేషన్స్ వేస్తే ఏదైనా తప్పులు ఉన్నా రేపు చూసుకోవచ్చు. అయితే.. ర్యాలీ హడావుడిలో పడి రాజగోపాల్ రెడ్డి నామినేషన్స్ వేసే విషయమే మరిచిపోయారు. ఆఖరి నిమిషంలో నామినేషన్ గురించి గుర్తుకు రావడంతో వెంటనే నామినేషన్ వేసే ఎన్నికల సంఘం ఆఫీసుకు పరిగెత్తుకుంటూ వెళ్లారు.

Komatireddy Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డి వెంట పరిగెత్తిన బాడీగార్డ్స్, కాంగ్రెస్ నేతలు

రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కోసం ఆఫీసుకు పరిగెత్తుతుంటే ఆయన వెనుక బాడీగార్డ్స్, కాంగ్రెస్ నాయకులు కూడా పరిగెత్తారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వార్నీ.. నామినేషన్ విషయమే మరిచితివా? ఇంకా నయం.. రేపే లాస్ట్ డేట్ అనే విషయం కూడా మరిచిపోయి ఉంటారు సారు.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి