Allu Arjun: తాజాగా బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ పుష్ప సినిమాపై కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అమితాబ్ కేబిసి15 హోస్టింగ్ తో బిజీగా ఉన్నారు. అంటే మన తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు షో లాగా. ఈ షో స్టార్ట్ అయింది మొదటగా బాలీవుడ్ లోనే. ప్రస్తుతం నడుస్తున్న ఈ షో కి అమితాబ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా టెలికాస్ట్ అయినా ఎపిసోడ్ లో 20 వేల ప్రశ్నకు అల్లు అర్జున్ పుష్ప గురించి అడిగారు. ఉత్తమ జాతీయ నటుడిగా ఎవరు అవార్డును అందుకున్నారు అని ప్రశ్న వేశారు. ఈ ఏడాది ఏ హీరోకి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు వచ్చిందని అడిగారు. దీంతో సదరు మహిళ అల్లు అర్జున్ అని టక్కున సమాధానం చెప్పారు.
మీరు పుష్ప సినిమా చూశారా అని సదరు మహిళను అమితాబ్ అడుగుతారు. హా చూశాను అని ఆమె చెబుతారు. దీంతో అమితాబ్ ఏం సినిమా.. అల్లు అర్జున్ ఏం నటించాడు.. అద్భుతంగా నటించాడు.. చెప్పులు వదిలేస్తే ఫేమస్ అవుతారని నాకు ఫస్ట్ టైం తెలిసింది. ఆ పాటలో చెప్పులు వదిలేసి స్టెప్పులు వేశాడు. అలా చేస్తే కూడా ఫేమస్ అవుతారా అని అనిపించింది అంటూ బన్నీ మీద అమితాబ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ మీద అమితాబ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
2021 లో విడుదలైన పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ బ్రేక్ చేసింది. అందులో బన్నీ మ్యానరిజం, లుక్స్, డైలాగ్స్, స్టెప్పులు ఇలా ప్రతి ఒక్కటి అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో పుష్ప మానియా ప్రపంచవ్యాప్తంగా పాకింది. దీంతో ఈ సినిమాకి జనాలలో మరింత ఆదరణ పెరిగింది. ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. దీంతో ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సుకుమార్, అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా సినిమా చేస్తున్నారు. ఈ రెండో పార్ట్ వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కాబోతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.