KTR – Revanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం దూసుకుపోతున్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. అధికార బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ బలం పెరుగుతోంది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నా కూడా ప్రస్తుతం ప్రజల నాడి తెలుసుకున్నా.. ఎక్కడ చూసినా జనాలు కాంగ్రెస్ కే ఓటేస్తాం అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్తోంది. ప్రజలు కూడా రెండు సార్లు అధికారం ఇచ్చాం కదా అన్న ధోరణిలోనే ఉన్నారు. అందుకే మరో పార్టీకి ఈసారి చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అది కాంగ్రెస్ ఎందుకు కాకూడదు అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసిలో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రచార దూకుడును పెంచింది.
బీఆర్ఎస్, బీజేపీ నుంచి వలసలు కూడా పెరిగాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం వస్తోంది. అలాగే.. 6 గ్యారెంటీ హామీలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశా పయనించేలా దోహదపడుతున్నాయి. తెలంగాణ ప్రజలు కూడా ఆరు గ్యారెంటీ హామీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ లాంటి పథకాలు తీసుకొచ్చినా కూడా ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నిరుద్యోగులు, బడుగు, బలహీన వర్గాలు, దళితులను బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇది కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ కాబోతోంది. దీన్ని గుర్తించిన బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఎదురుదాడి చేయడం ప్రారంభించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా పెరుగుతోందని పార్టీపై, పార్టీ నేతలపై మాటల యుద్ధం మొదలు పెట్టారు.
కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి కుర్చీ కోసం నాయకులంతా తన్నుకుంటారు. తెలంగాణలో సుస్థిరత కరువు అవుతుంది. కర్ణాటక రైతుల పేరుతో డ్రామాలు నడుస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఓట్ల చీలిక ఉండదు. ఇది బీఆర్ఎస్ కు ఒకరకంగా ఇబ్బంది పెట్టే అంశమే. అందుకే కాంగ్రెస్ బలాన్ని గుర్తించిన కేటీఆర్ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.