
Ysrcp : రోజు రోజుకి దిగజారిపోతున్న వైసీపీ పరిస్థితి.. జగన్ జాగ్రత్తపడకపోతే కష్టమే..!
Ysrcp : ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావటంతో ఏపీ రాజకీయం ఇకపై ఏకపక్షంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. టీడీపీ కూటమికి ఏకంగా 164 సీట్లు రావటం.. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావటంతో వైసీపీ కుదేలైందని అందరు భావించారు. కీలక నేతలు వారి దారి వారు చూసుకుంటున్నప్పటికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం తనదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వెళ్లేవాళ్లు వెళ్లనీ అనే ఉద్దేశంతో ఉన్న వైఎస్ జగన్.. పార్టీని నమ్ముకుని అండగా నిలబడే కార్యకర్తలు, నేతల్లో మాత్రం ధైర్యం, ధీమా నింపే ప్రయత్నం చేస్తున్నారు.
Ysrcp : రోజు రోజుకి దిగజారిపోతున్న వైసీపీ పరిస్థితి.. జగన్ జాగ్రత్తపడకపోతే కష్టమే..!
అయితే పరిస్థితి చేయి జారినట్టే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అని కొన్ని ప్రకటించిన వాటి జాడలేదు. దీనిపై వైసీపీ పెద్దగా స్పందించింది లేదు. విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ వైసీపీ తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమం వాయిదా పడింది. వాస్తవానికి ఫిబ్రవరి ఐదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఫీజు పోరు కార్యక్రమం చేపట్టాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆ మేరకు వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే పలు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఫిబ్రవరి 5న తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.
ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో వారానికి మూడు రోజుల పాటు పర్యటిస్తానని ప్రతి నియోజక వర్గంలో చివరి స్థాయి నేతతో కూడా మాట్లాడతానని అన్నారు. కాని ఇంత వరకు దాని జాడే లేదు. ఏపీలో అధికారం కోల్పోయాక వరుస ఎదురుదెబ్బలు తింటున్న వైసీపీకి మన్నిపల్ ఎన్నికలు మరిన్ని షాకులిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా జరిగిన డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు ఎక్కడికక్కడ వైసీపీకి ఓటమి రుచిచూపిస్తున్నారు. అదీ విచిత్రంగా వైసీపీ మెజార్టీ ఉన్న కౌన్సిళ్లలో కూటమి అభ్యర్ధులుగా వరుస విజయాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ తిరుపతి కార్పోరేషన్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది.తిరుపతి కార్పోరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఇవాళ కూటమి అభ్యర్ధి మునికృష్ణ విజయం సాధించారు. ఇలా వైసీపీని సమస్యలు వెంటాడుతున్నాయి.
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
This website uses cookies.