Ysrcp : రోజు రోజుకి దిగ‌జారిపోతున్న వైసీపీ ప‌రిస్థితి.. జ‌గ‌న్ జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే క‌ష్ట‌మే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : రోజు రోజుకి దిగ‌జారిపోతున్న వైసీపీ ప‌రిస్థితి.. జ‌గ‌న్ జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే క‌ష్ట‌మే..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 February 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Ysrcp : రోజు రోజుకి దిగ‌జారిపోతున్న వైసీపీ ప‌రిస్థితి.. జ‌గ‌న్ జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే క‌ష్ట‌మే..!

Ysrcp : ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావటంతో ఏపీ రాజకీయం ఇకపై ఏకపక్షంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. టీడీపీ కూటమికి ఏకంగా 164 సీట్లు రావటం.. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావటంతో వైసీపీ కుదేలైంద‌ని అంద‌రు భావించారు. కీలక నేతలు వారి దారి వారు చూసుకుంటున్నప్పటికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం తనదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వెళ్లేవాళ్లు వెళ్లనీ అనే ఉద్దేశంతో ఉన్న వైఎస్ జగన్.. పార్టీని నమ్ముకుని అండగా నిలబడే కార్యకర్తలు, నేతల్లో మాత్రం ధైర్యం, ధీమా నింపే ప్రయత్నం చేస్తున్నారు.

Ysrcp రోజు రోజుకి దిగ‌జారిపోతున్న వైసీపీ ప‌రిస్థితి జ‌గ‌న్ జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే క‌ష్ట‌మే

Ysrcp : రోజు రోజుకి దిగ‌జారిపోతున్న వైసీపీ ప‌రిస్థితి.. జ‌గ‌న్ జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే క‌ష్ట‌మే..!

Ysrcp ఏంటి ఈ ప‌రిస్థితి..

అయితే ప‌రిస్థితి చేయి జారిన‌ట్టే క‌నిపిస్తుంది. కూటమి ప్రభుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అని కొన్ని ప్ర‌క‌టించిన వాటి జాడ‌లేదు. దీనిపై వైసీపీ పెద్ద‌గా స్పందించింది లేదు. విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ వైసీపీ తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమం వాయిదా పడింది. వాస్తవానికి ఫిబ్రవరి ఐదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఫీజు పోరు కార్యక్రమం చేపట్టాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆ మేరకు వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే పలు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఫిబ్రవరి 5న తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.

ప్ర‌తి పార్లమెంట్ నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలో వారానికి మూడు రోజుల పాటు ప‌ర్య‌టిస్తాన‌ని ప్ర‌తి నియోజ‌క వ‌ర్గంలో చివ‌రి స్థాయి నేత‌తో కూడా మాట్లాడ‌తాన‌ని అన్నారు. కాని ఇంత వ‌ర‌కు దాని జాడే లేదు. ఏపీలో అధికారం కోల్పోయాక వరుస ఎదురుదెబ్బలు తింటున్న వైసీపీకి మన్నిపల్ ఎన్నికలు మరిన్ని షాకులిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా జరిగిన డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు ఎక్కడికక్కడ వైసీపీకి ఓటమి రుచిచూపిస్తున్నారు. అదీ విచిత్రంగా వైసీపీ మెజార్టీ ఉన్న కౌన్సిళ్లలో కూటమి అభ్యర్ధులుగా వరుస విజయాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ తిరుపతి కార్పోరేషన్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది.తిరుపతి కార్పోరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఇవాళ కూటమి అభ్యర్ధి మునికృష్ణ విజయం సాధించారు. ఇలా వైసీపీని స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది