Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. కానీ.. ఆయన రాజకీయాలు వదిలేసి చాలా ఏళ్లు అయింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయన మళ్లీ రాజకీయాల జోలికి వెళ్లలేదు. అస్సలు ఆ ముచ్చట కూడా మాట్లాడలేదు. కానీ.. ఈ మధ్య మరోసారి రాజకీయాల గురించి ఆయన మాట్లాడటంతో మళ్లీ ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ.. ఆయన వాల్తేరు వీరయ్య 200 వ రోజు వేడుకల్లో భాగంగా ఏపీ ప్రభుత్వంపై చురకలు వేశారు. అంతే తప్ప ఆయన ఏదో రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలని కాదు.
ఆయన ప్రసంగంలో భాగంగా ఏపీ ప్రభుత్వంపై కామెంట్లు చేశారు. ఏపీ ప్రభుత్వం కాస్త అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుంది అంటూ ఆయన చురకలంటించారు. అయితే ఆయన ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం సినీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. టికెట్ల రేట్లు పెంచే విషయంలో, బెనిఫిట్ షోల విషయంలో, ఐదో ఆట విషయంలో ఏపీ ప్రభుత్వం.. ఇండస్ట్రీపై వ్యతిరేక ధోరణిలోనే ఉంది. ఏ విషయంలోనూ సినీ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదు. అందుకే చిరంజీవి ఇక ఆగలేక ఓపెన్ అయిపోవాల్సి వచ్చింది. కానీ.. ఆయన మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు.సినిమా వాళ్ల గురించి మేము ఏనాడైనా మాట్లాడామా? పకోడి గాళ్లు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు.. మీ వాళ్లకు సలహాలు ఇచ్చుకోండి.. సినిమాలు చేసుకునే వాళ్లు సినిమాలు చేసుకుంటే మంచిది.
మీ రెమ్యునరేషన్ ఎంత అని మేము అడిగామా? అసలు సినిమా వాళ్ల గురించి రాజకీయ నాయకులు ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా? అంటూ వైసీపీ నేతలు అందరూ మూకుమ్మడిగా మెగాస్టార్ పై మాటల యుద్ధం ప్రకటించారు. ఇంత సడెన్ గా చిరంజీవి ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడినట్టు. అసలే ఎన్నికల కాలం. కొంపదీసి చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారా? ఎలాగూ తన తమ్ముడి పార్టీ ఉంది కదా. అందులో యాక్టివ్ అవుతారా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.