Chiranjeevi : మీకో దండం.. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లొగొద్దు.. మొర పెట్టుకున్న చిరంజీవి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : మీకో దండం.. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లొగొద్దు.. మొర పెట్టుకున్న చిరంజీవి

 Authored By kranthi | The Telugu News | Updated on :11 August 2023,2:00 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. కానీ.. ఆయన రాజకీయాలు వదిలేసి చాలా ఏళ్లు అయింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయన మళ్లీ రాజకీయాల జోలికి వెళ్లలేదు. అస్సలు ఆ ముచ్చట కూడా మాట్లాడలేదు. కానీ.. ఈ మధ్య మరోసారి రాజకీయాల గురించి ఆయన మాట్లాడటంతో మళ్లీ ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ.. ఆయన వాల్తేరు వీరయ్య 200 వ రోజు వేడుకల్లో భాగంగా ఏపీ ప్రభుత్వంపై చురకలు వేశారు. అంతే తప్ప ఆయన ఏదో రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలని కాదు.

ఆయన ప్రసంగంలో భాగంగా ఏపీ ప్రభుత్వంపై కామెంట్లు చేశారు. ఏపీ ప్రభుత్వం కాస్త అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుంది అంటూ ఆయన చురకలంటించారు. అయితే ఆయన ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం సినీ ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. టికెట్ల రేట్లు పెంచే విషయంలో, బెనిఫిట్ షోల విషయంలో, ఐదో ఆట విషయంలో ఏపీ ప్రభుత్వం.. ఇండస్ట్రీపై వ్యతిరేక ధోరణిలోనే ఉంది. ఏ విషయంలోనూ సినీ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదు. అందుకే చిరంజీవి ఇక ఆగలేక ఓపెన్ అయిపోవాల్సి వచ్చింది. కానీ.. ఆయన మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు.సినిమా వాళ్ల గురించి మేము ఏనాడైనా మాట్లాడామా? పకోడి గాళ్లు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు.. మీ వాళ్లకు సలహాలు ఇచ్చుకోండి.. సినిమాలు చేసుకునే వాళ్లు సినిమాలు చేసుకుంటే మంచిది.

megastar chiranjeevi requests not to drag him into politics

megastar chiranjeevi requests not to drag him into politics

Chiranjeevi : చిరంజీవి రాజకీయాల్లోకి మళ్లీ రాబోతున్నారా?

మీ రెమ్యునరేషన్ ఎంత అని మేము అడిగామా? అసలు సినిమా వాళ్ల గురించి రాజకీయ నాయకులు ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా? అంటూ వైసీపీ నేతలు అందరూ మూకుమ్మడిగా మెగాస్టార్ పై మాటల యుద్ధం ప్రకటించారు. ఇంత సడెన్ గా చిరంజీవి ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడినట్టు. అసలే ఎన్నికల కాలం. కొంపదీసి చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారా? ఎలాగూ తన తమ్ముడి పార్టీ ఉంది కదా. అందులో యాక్టివ్ అవుతారా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది