Roja : ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో అసెంబ్లీలో టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేశారు. అసలు మీరు చర్చ కోసం వచ్చారా? లేక రచ్చ కోసం వచ్చారా అనేది ప్రజలకే అర్థం అయింది అంటూ టీడీపీ నేతలు చేసిన రచ్చపై తాజాగా మంత్రి రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ చేసి 371 కోట్ల అవినీతి చేశాడు. ఎలా షెల్ కంపెనీల ద్వారా మళ్లీ తన అకౌంట్లలోకి డబ్బులు మళ్లించుకున్నాడు. అదంతా నిరూపితం అయి ఆయన అరెస్ట్ అయితే పచ్చ పార్టీ వాళ్లకు పిచ్చి పట్టింది. వాళ్లు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారు. అసెంబ్లీలో బాలకృష్ణ ఏం చేశారో రాష్ట్రమంతా చూసింది. పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేశారు.
తొడలు కొట్టి మీసాలు తిప్పాడు బాలకృష్ణ. ఈ రోజు బాలకృష్ణ గారిని అడుగుతున్నాను. తొడగొట్టిన బాలకృష్ణ ఈరోజు తోక ముడిచి ఎందుకు అసెంబ్లీ నుంచి పారిపోయారు.. అంటూ రోజా ప్రశ్నించారు. మీసం తిప్పిన బాలకృష్ణ ఈరోజు అజెండాలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ఏదైతే డిస్కస్ చేయొచ్చు అని చెప్పగానే పారిపోయారెందుకు. రోషం లేదా? లేదా.. మీ బావ తుప్పు కాదు.. నిప్పు అనే చెప్పడానికి మనస్సాక్షి ఒప్పుకోవడం లేదా? అని రోజా ప్రశ్నించారు.
అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియని బాలకృష్ణ కేసులు కొట్టేయాలి.. అంటూ ఎలా అరుపులు చేశారో మీరందరూ చూశారు. చంద్రబాబు సీటు మీద మనసు పడిందేమో. ఆ సీటెక్కి కూర్చోలేక నిలుచోలేక బయటి నుంచి కొనుక్కొచ్చిన విజిల్స్ వేస్తూ ఎలా చిల్లర చేష్టలు చేశారో మీరందరు కూడా చూశారు. మరి ఇప్పుడు హైకోర్టు మీకేసులు, పిటిషన్లను కొట్టేయమని చెప్పి మీరేసిన కేసులు కొట్టేసిందంటే.. ఇప్పుడేమంటావు బాలకృష్ణ అని నేను అడుగుతున్నా. అసెంబ్లీలోకి వచ్చి చిల్లర చేష్టలు చేయడం కాదు. నీకు దమ్ముంటే, దైర్యం ఉంటే హైకోర్టు దగ్గరికి వెళ్లి జడ్జి గారి ముందర ఇలాగే తొడకొట్టి మీసాలు తిప్పి విజిల్స్ వేయండి. అప్పుడు తెలుస్తుంది. నిజంగా ఎంత సిగ్గు చేటు అంటే.. టీడీపీ వాళ్లు అబద్ధాన్ని పది సార్లు చెబితే జనాలు నిజం అని నమ్ముతారు అనకొని చంద్రబాబు దేవుడు, ఆయన ప్రజల కోసం పోరాటాలు చేశారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల కోసమే ఎప్పుడూ ఆలోచిస్తారు అని వాళ్ల కుటుంబ సభ్యులు చెబుతుంటే ప్రజలు అవే నిజం అనుకుంటారు అని వీళ్లు అనుకుంటున్నారు.. అంటూ రోజా మండిపడ్డారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.