
Modi : బాబు కు షాక్ ఇచ్చి రేవంత్ ను హ్యాపీ చేసిన మోడీ
Modi : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra pradesh ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం భారీ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిరాకరిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల 27న నిర్వహించిన ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఏపీ ప్రభుత్వం పూర్తి ఆధారాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అంతేగాక ప్రాజెక్టు తొలిదశకు అనుమతులు అవసరం లేదని ఏపీ వాదించినప్పటికీ, కేంద్రం రెండో దశకు కూడా అనుమతులు ఇవ్వడానికి అంగీకరించలేదు.
Modi : బాబు కు షాక్ ఇచ్చి రేవంత్ ను హ్యాపీ చేసిన మోడీ
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కేంద్రానికి పలు దఫాలు ఫిర్యాదులు చేసింది. గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) లో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తమ ప్రాజెక్టును నిబంధనల ప్రకారం చేపట్టలేదని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. కేంద్రం దీనిపై సమీక్ష నిర్వహించగా అంతర్-రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ప్రాజెక్టును అమలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తేలింది. దీంతో ఏపీ దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ అయినప్పటికీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు భారీ ఊరటగా మారింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ “మా ప్రభుత్వం నిరంతరాయంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా కేంద్రం ఈ అనుమతులను తిరస్కరించింది” అని అన్నారు. అలాగే ఈ నిర్ణయం తెలంగాణ కృష్ణా పరివాహక ప్రాంత రైతులకు మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జలవివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Brahmamudi Today Episode: బ్రహ్మముడి సీరియల్ 941వ ఎపిసోడ్ ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసేలా సాగింది. కావ్య–ధర్మేంద్ర ట్రాక్‌లో కీలక మలుపులు…
Karthika Deepam 2 Today Episode : బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న 'కార్తీకదీపం: ఇది నవవసంతం' సీరియల్ ఇప్పుడు ఎంతో…
Screen Time Guidelines: నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ లేకుండా జీవితం ఊహించలేనిది. పని అయినా చదువు…
Heart attack : ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వయస్సు, లింగం అనే తేడా లేకుండా…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 28 జనవరి 2026, బుధవారం ఏ రాశి…
India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్…
Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్లో మరో హాట్ అప్డేట్కు…
This website uses cookies.