Modi : బాబు కు షాక్ ఇచ్చి రేవంత్ ను హ్యాపీ చేసిన మోడీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Modi : బాబు కు షాక్ ఇచ్చి రేవంత్ ను హ్యాపీ చేసిన మోడీ

 Authored By ramu | The Telugu News | Updated on :16 March 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Modi : బాబు కు షాక్ ఇచ్చి రేవంత్ ను హ్యాపీ చేసిన మోడీ

Modi : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra pradesh ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం భారీ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిరాకరిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల 27న నిర్వహించిన ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఏపీ ప్రభుత్వం పూర్తి ఆధారాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అంతేగాక ప్రాజెక్టు తొలిదశకు అనుమతులు అవసరం లేదని ఏపీ వాదించినప్పటికీ, కేంద్రం రెండో దశకు కూడా అనుమతులు ఇవ్వడానికి అంగీకరించలేదు.

Modi బాబు కు షాక్ ఇచ్చి రేవంత్ ను హ్యాపీ చేసిన మోడీ

Modi : బాబు కు షాక్ ఇచ్చి రేవంత్ ను హ్యాపీ చేసిన మోడీ

Modi  చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కేంద్రానికి పలు దఫాలు ఫిర్యాదులు చేసింది. గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) లో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తమ ప్రాజెక్టును నిబంధనల ప్రకారం చేపట్టలేదని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. కేంద్రం దీనిపై సమీక్ష నిర్వహించగా అంతర్-రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ప్రాజెక్టును అమలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తేలింది. దీంతో ఏపీ దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ అయినప్పటికీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు భారీ ఊరటగా మారింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ “మా ప్రభుత్వం నిరంతరాయంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా కేంద్రం ఈ అనుమతులను తిరస్కరించింది” అని అన్నారు. అలాగే ఈ నిర్ణయం తెలంగాణ కృష్ణా పరివాహక ప్రాంత రైతులకు మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జలవివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది