
mynampally rohit rao says that congress will give 48 hours power
Mynampally Rohit Rao : మైనంపల్లి రోహిత్ రావు తెలుసు కదా. మైనంపల్లి హన్మంత రావు కొడుకు. మెదక్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మైనంపల్లి హన్మత రావు మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలుసు కదా. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వచ్చినా కూడా తన కొడుకుకు మెదక్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని చెప్పి మంత్రి హరీశ్ రావుపై ఆరోపణలు చేసి మరీ హన్మంత రావు కాంగ్రెస్ లో చేరారు. దీంతో హన్మంత రావుకు మల్కాజిగిరి నుంచి, ఆయన కొడుకు రోహిత్ రావుకు కాంగ్రెస్ అధిష్ఠానం మెదక్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ను ఇచ్చింది. టికెట్ ఇచ్చినప్పటి నుంచి రోహిత్ రావు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోనే మకాం వేశారు. బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
తాజాగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తోంది కదా. అదే విధంగా చేయి గుర్తు ప్రభుత్వం వచ్చినంక అవసరమైతే రోజుకు 48 గంటలు ఉంటే 48 గంటలు కూడా కరెంట్ ఇస్తం. అంటే అట్లాంటోళ్లం మేము. అట్లాంటోళ్లం. ఇప్పుడు ఉండేదాని కన్నా అవసరం ఉంటే, నిజంగా అవకాశం ఉంటే రోజుకు 24 గంటలు ఉంటే ఒక గంట ఎక్కువే ఇస్తం తప్ప తక్కువ ఇవ్వం.. అంటూ మైనంపల్లి రోహిత్ స్పష్టం చేశాడు.
తాజాగా రోహిత్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడిని వెంటనే ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చూపించండిరా బాబు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అరెయ్.. అన్ ఎడ్యుకేటెడ్ ఫూల్.. ఏం మాట్లాడుతున్నావురా.. అందుకే చదువుకోండి ఫస్ట్.. చదువుకోకుండా పరీక్షలు రాస్తే ఇలానే ఉంటది రిజల్ట్ అంటూ రోహిత్ ను ట్రోల్ చేస్తున్నారు.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.