Home » Andhra Pradesh » Nara Bhuvaneswari Sensational Comments About Chandrababu Arrest
andhra pradesh

Nara Bhuvaneswari : ఆయన ఇక బయటికి రారు.. ఆశలు వదులుకోండి.. నారా భువనేశ్వరి షాకింగ్ కామెంట్స్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: October 19, 2023, 8:00 pm
Advertisement

Nara Bhuvaneswari : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు. మళ్లీ రిమాండ్ పెంచుతూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే రెండు సార్లు రిమాండ్ విధించారు. మూడో సారి కూడా రిమాండ్ ను పెంచారు. అసలు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారు.. ఏ కారణం చేత అరెస్ట్ చేశారు అనేది కూడా చెప్పకపోతే ఎలా.. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలని కక్ష కట్టి.. ఇలా చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరోసారి చంద్రబాబు రిమాండ్ పెంపుపై భువనేశ్వరి తాజాగా స్పందించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్ మరో రెండు స్కామ్ లలో చంద్రబాబుపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో లోకేష్ ను కూడా విచారించారు. చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారిస్తున్నారు.

Advertisement

చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని.. కనీసం గవర్నర్ ను కూడా సంప్రదించకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో మంతనాలు జరిపారు. కానీ.. అవేవీ పెద్దగా ఫలించినట్టుగా కనిపించడం లేదు. సుప్రీంకోర్టు లాయర్లను పెట్టుకొని బెయిల్ కోసం శతవిధాలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ.. రిమాండ్ పెంచుతున్నారు కానీ.. ముందస్తు బెయిల్ మాత్రం ఏ కేసులోనూ చంద్రబాబుకు ఇవ్వడం లేదు. దీంతో చంద్రబాబుకు అన్ని దారులూ ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు ఆరోగ్యం అయితే అస్సలు బాగోలేదు. జైలులో కనీస సౌకర్యాలు లేవని.. చంద్రబాబు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని.. చంద్రబాబుకు దోమలు కుడుతున్నాయని.. వేడి నీళ్లు కూడా ఇవ్వడం లేదు. తినేందుకు కనీసం ఒక టేబుల్ కూడా లేదంటూ జైలు అధికారులపై చంద్రబాబు కుటుంబ సభ్యులు మండిపడిన విషయం తెలిసిందే.

#image_title

Advertisement

Nara Bhuvaneswari : సడెన్ గా ఆగిపోయిన టీడీపీ కార్యక్రమాలు, నారా లోకేష్ యువగళం పాదయాత్ర

మరోవైపు టీడీపీ కార్యక్రమాలు, నారా లోకేష్ యువగళం పాదయాత్ర అన్నీ సడెన్ గా ఆగిపోయాయి. చంద్రబాబు ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశాలు కూడా లేవు. కొన్ని రోజుల్లో కోర్టులకు దసరా సెలవులు రానున్నాయి. దీంతో దసరా తర్వాత నవంబర్ లోనే చంద్రబాబు బెయిల్ పై, విడుదలపై విచారణ జరిగే అవకాశం ఉంది. అందుకే.. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ముందుండి టీడీపీని నడిపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నేతలు కూడా భువనేశ్వరి, బ్రాహ్మణి ముందుకొస్తేనే, పార్టీని నడిపిస్తేనే వచ్చే ఎన్నికల్లో పార్టీకి కాస్తో కూస్తో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. చూద్దాం మరి చంద్రబాబు ఎప్పుడు బయటికి వస్తారో? వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో?

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి