#image_title
Nara Lokesh : ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ పైనే చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చంద్రబాబుకు మద్దతు ఇచ్చే వాళ్లు చాలా తక్కువయ్యారు. అందరూ చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిందే అని బద్దలు కొట్టారు కానీ.. టీడీపీకి అండగా పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్.. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. అంతే కాదు.. టీడీపీకి అండగా ఉంటానని, జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతే కాదు.. రాజమండ్రి జైలులో చంద్రబాబును చూడటానికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ప్రకటించారు. దీంతో టీడీపీ నేతల్లో కాస్తో కూస్తో ఉత్సాహం వచ్చినంత పని అయింది. ఎందుకంటే.. ఇప్పటికే తమ అధినేత చంద్రబాబు జైలులో ఉండటంతో నారా లోకేష్ ఒక్కరి మీదనే పార్టీ నిర్వహణ బాధ్యత పడటంతో పార్టీని ఆయన ఒక్కరే ఎలా ముందుకు తీసుకెళ్తారో అని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ.. చంద్రబాబు లేకపోయినా.. పార్టీకి అండగా ఉంటానని చెప్పడమే కాదు.. టీడీపీకి అండగా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు.
ఈసందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ 2014 లో టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చారు. అప్పుడు 2014 లో ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పారు. అలాగే.. ఇప్పుడు కూడా మళ్లీ వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారని స్పష్టం చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక అన్యాయం జరుగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. బీసీలను తీసుకుంటే పవన్ ఇప్పుడే చెప్పినట్టు అమర్ నాథ్ గౌడ్ అనే కుర్రాడు.. తన అక్కను వేధించవద్దు అన్నందుకు వైసీపీ నేత కొడుకు అతడిని చంపేశాడు. ఆ అబ్బాయి ఇప్పుడు బెయిల్ మీద బయట తిరుగుతుంటే అతడికి ఊరేగింపు చేస్తున్నారు అని నారా లోకేష్ మండిపడ్డారు. బీసీకి రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లకు రావాల్సిన రిజర్వేషన్లను 10 శాతం కట్ చేసింది ఈ ప్రభుత్వం. ఇక మా దళిత సోదరులకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. మైనార్టీ సోదరులను కూడా వదిలిపెట్టలేదు. ప్రభుత్వం వేధింపుల వల్ల చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు అని నారా లోకేష్ మండిపడ్డారు..
ప్రభుత్వ చేతకానితనం వల్ల సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేశారు. రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. కౌలు రైతుల్లో రెండో స్థానంలో ఉంది. కరెంట్ బిల్లులు, పెట్రోలు ధరలు, డీజిల్ ధరలు, చెత్త పన్ను, ఆర్టీసీ ధరలు, ఇంటి పన్ను అన్నీ పెంచేసి పెద్ద ఎత్తున ప్రజలపైన భారం మోపింది ఈ ప్రభుత్వం. నాలుగున్నర సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు. 2,30,000 ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తా అని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్.. ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదు. ప్రజా సమస్యలపై పోరాడిన వాళ్లపై కేసులు పెడుతున్నారు. వేధిస్తున్నారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని వేధిస్తున్నారు అంటూ నారా లోకేశ్ మండిపడ్డారు.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.