
#image_title
Nara Lokesh : ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఎం జగన్ అరెస్ట్ చేయించారని.. నారా లోకేష్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సీఎం జగన్ పై నారా లోకేశ్ రెచ్చిపోయారు. సైకో జగన్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ సైకో జగన్ ఏదైతే అవకూడదని అనుకున్నాడో అదే జరిగింది. అదే.. టీడీపీ, జనసేన పొత్తు. చంద్రబాబును అరెస్ట్ చేసిన మొదటి వారంలోనే ములాకత్ లో చంద్రబాబును కలవాలని ఆనాడు పవన్ కళ్యాణ్ కోరారు. చంద్రబాబును బాలయ్య బాబుతో కలిసి నేను, పవన్ కళ్యాణ్ మన నాయకుడిని కలిశాం. సరిగ్గా 5 నిమిషాల్లో ప్రజల గురించి మనం పోరాడాలి. ప్రజలకు అండగా ఉండాలి. కలిసి పోరాడుదాం అని ఈ ఇద్దరు నాయకులు నిర్ణయం తీసుకొని అక్కడ పొత్తు ప్రకటించారన్నారు నారా లోకేష్.
టీడీపీ, జనసేన మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ నాయకులు, 5 రూపాయల పేటీఎం బ్యాచులు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే.. ఇక్కడున్న కార్యకర్తలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులందరినీ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఇప్పటికే జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. ఎల్లుండి మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్ లో ఉమ్మడి కార్యచరణ కూడా ప్రకటిస్తామని ఈ సభా ముఖంగా మీ అందరికీ చెబుతున్నాను. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన ఈ రెండు కలిసి పోరాడుతాయి. రైతులను వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోరాడుతారు. జగన్ పాలనలో దళితులకు, బీసీలకు, మైనార్టీలపై జరుగుతున్న అన్యాయం తెలుసుకొని వీరిద్దరూ కలిసి ముందుకెళ్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను అని నారా లోకేష్ అన్నారు.
#image_title
చంద్రబాబుపైన, పవన్ పైన ఈ ఐదు రూపాయల పేటీఎం బ్యాచ్ ఏకంగా వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తున్నది. మైసీపీ నేతలకు చెబుతున్నా. సైకో జగన్ కు చెబుతున్నా. ఒక్కసారి మీ కుటుంబంలో ఏం జరుగుతుందో బయటపెడితే మీరు మీ మొహం ఎక్కడ పెడతారో ఒక్కసారి ఆలోచించి మరీ చెప్పండి. బాబు గారు మాకు పదే పదే చెప్పారు. వ్యక్తిగతంగా వెళ్లొద్దు. ఏదైనా రాజకీయంగా వెళ్లాలి. రాజకీయంగా పోరాడుదాం అని. ఆయన ఇచ్చిన నినాదంతోనే ఈరోజు మేము సమన్వయం పాటిస్తున్నామని వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. కృష్ణా జలాలలో వాటాలు మనం కోల్పోయాం. వర్షాలు లేక పంటలు ఈరోజు మొత్తం ఎండిపోతున్నాయి. ప్రాజెక్టులన్నీ ఖాళీ అయిపోయాయి. పంటలను కాపాడాల్సిన సైకో జగన్.. ఏకంగా ప్రజల్లోకి వెళ్లకుండా మన కార్యకర్తలపైన, మన నాయకులపైన ఇప్పటికే అనేక దాడులు చేస్తున్నారు. ఇసుక మొత్తం ఒక తమ్ముడికి అప్పగించారు. ఇప్పుడు మద్యం ఇంకో తమ్ముడికి అప్పగిస్తున్నాడు.. అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.