Pawan Kalyan : ఒకే ఒక్క ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వు పవన్.. ది తెలుగు న్యూస్ ప్రశ్న ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : ఒకే ఒక్క ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వు పవన్.. ది తెలుగు న్యూస్ ప్రశ్న ఇదే !

Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఒకటే చర్చ. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించి. అసలు ఆయన ఎందుకు ఆ యాత్ర చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఆ యాత్ర పేరుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అవును.. ఎక్కడ చూసినా జగన్ ను తిట్టడం, వైసీపీపై విమర్శలు చేయడం తప్పితే మరో పని లేదు. అయితే.. పవన్ కళ్యాణ్ ను ఎందుకు సీఎం జగన్ ను తిడుతున్నావు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :26 June 2023,3:00 pm

Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఒకటే చర్చ. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించి. అసలు ఆయన ఎందుకు ఆ యాత్ర చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఆ యాత్ర పేరుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అవును.. ఎక్కడ చూసినా జగన్ ను తిట్టడం, వైసీపీపై విమర్శలు చేయడం తప్పితే మరో పని లేదు. అయితే.. పవన్ కళ్యాణ్ ను ఎందుకు సీఎం జగన్ ను తిడుతున్నావు అంటే సమాధానం చెప్పగలరు.. కానీ.. కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేరు. అందులో రెండు అయితే కీలకం.

తన భార్యలకు సంబంధించిన ప్రశ్న వేస్తే అంతే ఇక.. పవన్ కళ్యాణ్ నోరు తెరవరు. తన భార్యల గురించి ఒకటే ప్రశ్నిస్తున్నారు అంటూ ఆ మధ్య ఫైర్ అయ్యారు కానీ.. ఇప్పుడు తన భార్యల గురించి అడిగితే నోరు విప్పడం లేదు. అలాగే.. టీడీపీతో ఎన్ని సీట్లలో పొత్తు ఉంటుంది అంటే కూడా పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉండదు. ఆ ప్రశ్నకు కూడా ఆయన దగ్గర సమాధానం ఉండదు.పోనీ.. కనీసం పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారో దాని గురించి సమాధానం అయినా చెప్పగలరా? ఈ ప్రశ్న అడిగితే.. అడిగిన వాళ్లను తన చెప్పుతో కొట్టినా కొడతారు. నిజానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నే కానీ.. పవన్ కళ్యాణ్ కు మాత్రం ఈ ప్రశ్న తీవ్రమైన చిరాకు తెప్పిస్తుంది.

Pawan kalyan

Pawan kalyan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు?

అసలు.. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో.. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో ఆయనకు కూడా క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు కానీ.. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తన పార్టీయే ఒక్క సీటు గెలుచుకుంది. ఇప్పుడు అది కూడా లేదు. మరి.. వారాహి యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న పవన్.. తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దానికి పవన్ ఎప్పుడు సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది