Pandit krishnamacharya' ఆయనకు సీఎం అయ్యే యోగం ఈసారి లేదు.. ఏలినాటి శని భయంకరంగా ఉంది ' - ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ కృష్ణమాచార్య..
Pandit krishnamacharya ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతుండగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు పండిట్ కృష్ణమాచార్య. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశికి చెందినవారు. ఆయన వ్యక్తిగత జాతకంలో అష్టమ స్థానంలో శని భగవానుడి సంచారం జరుగుతుంది. అలా అని కెసిఆర్ గారు ఓడిపోతారని చెప్పలేం. సక్లిష్టమైన పరిస్థితుల నుంచి గట్టెక్కే అవకాశం ఉన్నది. విచిత్రమైన ఫలితాన్ని శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు పొందుతారు. తెలంగాణకు సంబంధించిన ఉద్యమాల్లో ఒక పోరాట వీరుడు అని మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి జీవితంలో విభిన్నమైన ఫలితం రాబోతుంది. ఒకవేళ గజ్వేల్ లో గెలిస్తే కామారెడ్డి లో గెలిసే అవకాశం ఉంది. కామారెడ్డి లో ఓడిపోతే గజ్వేల్ లో కూడా ఓడిపోయే అవకాశం ఉంది.
కేతు గ్రహ సంచారం వలన ఆయన ఒక స్థానంలో గెలిస్తే రెండవ స్థానంలో గెలిచే అవకాశం ఉంటుంది. రెండు స్థానాలు ఓడిపోయే అవకాశం లేదు. ఎవరికి అంతుచిక్కని విధంగా కూడా గెలిచే అవకాశం ఉంది. ఈ సంక్లిష్టమైన పరిస్థితులు మునుగోడులో కూడా చూసాం. కెసిఆర్ గారికి అంత సులభమైన స్థితిగతులు లేవు. విజయం అనేది తోబుచులాడుతుంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చినట్లుగా ఆయన పూర్తిగా ఓడిపోయారని అర్థం కాదు. ఇక రేవంత్ రెడ్డి గారి జాతకంలో శుక్ర భగవానుడి అనుగ్రహం ఉంది. శుక్రుడు అనుకూలవంతమైన ప్రతికూలవంతమైన భావనలో మిత్రులాభం, మిత్రభేదం అనే విషయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
కొడంగల్, కామారెడ్డి నుంచి కానీ రేవంత్ గట్టెక్కే అవకాశం ఉంది. సొంత వర్గం సంబంధించిన వ్యక్తులను నుంచి చిన్న ముప్పు ఉంది. విజయానికి దగ్గరలో ఉన్నారు. రెండు స్థానాల్లో గెలవలేకపోవచ్చు. విభిన్నమైన ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి జాతకంలో మిత్ర బేధం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రెండు స్థానాలు గెలవడం అనేది దాదాపుగా అసాధ్యం. మిత్ర భేదం వలన కొన్ని చికాకులు వస్తాయి. సొంత వర్గం వారు ఏదైనా కుట్రలో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు. రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో గెలుస్తారు. రెండు స్థానాల్లో మాత్రం గెలిచి అవకాశం లేదు అని అన్నారు. ఇక చివరిదాకా ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేం. మీడియా వాళ్ళు సామాజిక మధ్యమాలు కొన్ని వేల మందిని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తాయి. ఆ ఒక్క పార్టీ గెలుస్తుందని ఒక నిర్ణయానికి వస్తారు. కానీ తెలంగాణలో కోట్లాదిమంది ప్రజలు ఒకే నిర్ణయం మీద ఉన్నారని చెప్పలేం అని అన్నారు.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.