
Parents : బ్రతికి ఉండగానే కూతురుకి పిండం పెట్టిన తల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?
Parents : నాడియా జిల్లాలో ఏకంగా బతికి ఉన్న యువతికి కుటుంబ సభ్యులు పిండం పెట్టడం కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతిని చనిపోయినట్టుగా ప్రకటించి కుటుంబం సంప్రదాయ ఆచారాలను నిర్వహించింది. ఆమె తల్లి, మేనమామ సహా కుటుంబ సభ్యుల చర్యలపై తీవ్ర చర్చ నడుస్తుంది.
Parents : బ్రతికి ఉండగానే కూతురుకి పిండం పెట్టిన తల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?
డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఆ యువతికి కుటుంబ సభ్యులు ఒక సంబంధం ఖరారు చేశారు. ఆమె నిరాకరించింది. కుటుంబంతో తీవ్ర వాగ్వాదాలు జరగగా, ఆ యువతి ఓ ముస్లిం యువకుడితో ప్రేమలో పడింది. అనంతరం అతడితో కలిసి ఇంటి నుంచి పారిపోయి వేరే చోట వివాహం చేసుకుంది.ఈ వ్యవహారం జరిగిన 12 రోజుల తరువాత యువతి కుటుంబ సభ్యులు ఆమెను “సమాజపరంగా చనిపోయినట్లుగా” భావించి సంప్రదాయ హిందూ కర్మలను నిర్వహించారు.
పూజారి ఆధ్వర్యంలో ఆమె ఫోటోకు పూలమాల వేసి శ్రద్ధకర్మలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు తలలు గుండు కొట్టించుకుని, ఆమె వ్యక్తిగత వస్తువులను తగలబెట్టారు.యువతి మేనమామ సోమనాథ్ బిశ్వాస్ మాట్లాడుతూ, మేము ఆమెకు మంచి సంబంధం చూశాం. పెళ్లిని ఘనంగా నిర్వహించాలనుకున్నాం. కానీ మా మాట వినకుండా, చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. మాకు నష్టమవటమే కాదు, పరువు కూడా పోయింది అని తెలిపారు.
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…
This website uses cookies.