Janasena : వారందరికి జనసేననే బెస్ట్ ఆప్షన్… అందుకు కారణం ఏంటంటే..!
ప్రధానాంశాలు:
Janasena : వారందరికి జనసేననే బెస్ట్ ఆప్షన్... అందుకు కారణం ఏంటంటే..!
Janasena : సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీకి కొత్త జోష్ వస్తోంది. అధికారంలోకి వచ్చి వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా జనసేనలోకి సరికొత్త ఉత్సాహం వస్తోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను చేరిక లాంఛనం కాగా అదే బాటలో మరికొందరు ఉన్నట్లు సమాచారం. ఈ చేరికలతో గ్లాస్ పార్టీ కళకళలాడుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో పార్టీ బలోపేతం కానుండడం గమనార్హం. అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రితో సహా కొన్ని పదవులు పొందిన ఈ పార్టీ ఇక రాజకీయంగా బలోపేతంపై దృష్టి సారించింది. ఈక్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది.
Janasena నాయకుల క్యూ
జనసేన కూడా నెమ్మదిగా తన రాజకీయ వ్యూహాన్ని అదే దిశగా అమలు చేస్తూ పోతోంది. టీడీపీలో చేరాలని ఎవరైనా అనుకున్నా నాలుగు దశాబ్దాల పార్టీ , అందులో నాయకులు కోకొల్లలుగా ఉన్నారు. అంతే కాదు ఆ పార్టీలో ఇప్పటికే హౌజ్ ఫుల్ గా ఉంది. ఇక వైసీపీని పార్టీగా కాకుండా ఒక కార్పొరేట్ సంస్థగా నడుపుతున్నారు అన్న విమర్శ ఉంది. దీంతో చాలా మంది జనసేనలో చేరడమే ఉత్తమంగా ఉంది అని అంటున్నారు. జనసేనలో అధినాయకుడు పవన్ కళ్యాణ్ నియంత పోకడలు చూపించరు అని అంటున్నారు. మెగాభిమానులు కూడా జనసేనలో నాయకులకు అండగా ఉంటారు. యువత మహిళ అభిమానులు కూడా ఆ పార్టీకి పెట్టని కోటగా ఉంటున్నాయి.
2026లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య బాగా పెరుగుతుంది. దాంతో ఇలా జనసేనలో చేరిన వారికి టికెట్లు దక్కుతాయని కూడా భావిస్తున్నారు. రాజకీయ పరిణామాలు ఏమైనా మారి జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఇక తిరుగేలేదు అని భావించే ముందు చూపు ఉన్న వారు కళ్ళు మూసుకుని జనసేనకు ఓటు వేస్తున్నారు. వీటికి మించి పవన్ కళ్యాణ్ దగ్గర తమకు గౌరవం ఉంటుందని ఆయన ఏమి చెప్పినా వింటారని కూటమిలో జనసేనకు ఉన్న ప్రాధాన్యత రిత్యా నామినేటెడ్ సహా కీలక పదవులు కూడా రానున్న కాలంలో అందుకోవచ్చు అని ఆశపడుతున్న వారు కూడా ఆ వైపు చూస్తున్నారు. జనసేన గాలానికి వైఎస్సార్‌సీపీ చిక్కి విలవిలలాడుతోంది. దసరాలోపు భారీ ఎత్తున జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు చేరనున్నారని సమాచారం. ఇప్పటికే పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో వైఎస్సార్‌సీపీ నాయకులు వరుసగా సమావేశమవుతున్నారు.