
Pawan kalyan : నా పేరు చెప్పి రూల్స్ బ్రేక్ చేస్తే అందరు నన్ను కొడతారంటూ పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్
Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాజకీయాలలో చురుకుగా కదులుతున్నారు. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని వెంటనే పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నారు. అయితే తనని బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేసేందుకు పవన్ కళ్యాణ్ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG మూవీ అప్డేట్‌తో పాటు తన తదుపరి చిత్రాల షూటింగ్‌పై కూడా క్లారిటీ ఇచ్చేశారు.
పవన్ మాట్లాడుతుండగా.. ఆయన అభిమానులు OG.. OG అంటూ అరిచారు. దాంతో పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు.OGనా.. నాకు సినిమాలు చేసే టైం ఉందంటారా?? నేను మాట ఇచ్చాను కాబట్టి.. మీతో నేను తిట్టించుకోకూడదు కదా.. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వెళ్లి OG సినిమా చేస్తున్నావా? అని తిట్టకూడదు కదా.. అందుకే మూడు నెలలు పాటు.. రోడ్లు, ప్రజా పాలనపైనే దృష్టిపెట్టాను. మా నిర్మాతలకు కూడా చెప్పాను. నన్ను క్షమించాలి. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసుకుంటాను. నాకు కుదిరినప్పుడు రెండు రోజులో.. మూడు రోజులో షూటింగ్ చేస్తాను. మీరు OG చూద్దురు గాని.. బాగుంటుంది. ముందు నన్ను పనిచేయనీయండి. ఎమ్మెల్యేగా పనిచేస్తావని నిన్ను ఎన్నుకంటే OG ఏంటీ క్యాజీ అంటే నేనేం చెప్పాలి. అందుకే కుదిరినప్పుడు రెండు మూడు రోజులు షూటింగ్ చేస్తా అని పవన్ అన్నారు.
Pawan kalyan : నా పేరు చెప్పి రూల్స్ బ్రేక్ చేస్తే అందరు నన్ను కొడతారంటూ పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్
ఇక మనం గెలిచాం కదా అని చెప్పి.. గత ప్రభుత్వ నాయకుల్ని కానీ.. వారి కార్యకర్తల్ని కానీ.. హింసించవద్దు. వారిపై దాడులుచేయొద్దు. కనీసం వారిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌లు పెట్టొద్దు.. మనం కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దు. అది మనకి మంచిది కాదు.. అలాంటి పనులు మనం చేయొద్దు. పిఠాపురం తాలూకా అని చెప్పి నాకు చెడ్డపేరు తీసుకుని రావొద్దు. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్‌లు ఏదంటే.. పిఠాపురం తాలూకా అంటే నన్ను తిడతారు. కొడతారు. మీరు రాంగ్‌వేలో వెళ్తూ.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే ఎట్టా.. ముందు మనం నిబంధనల్ని పాటించాలి. అందరూ చట్టాలను గౌరవించాలి. ముందు మీరు రూల్స్ పాటించండి. మీకు కావాలంటే నాకు ఇక్కడ రెండెకరాల పొలం ఉంది. అక్కడికి వచ్చి.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అని బైక్‌లు వేసుకుని వచ్చి తిరగండి అని పవన్ తెలియజేశారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.