Home » Exclusive » Pawan Will Be Cheated By Chandrababu Venu Swamy Comments
Exclusive

Venu Swamy : చంద్రబాబు చేతిలో పవన్ మోసపోతాడు.. వేణుస్వామి సంచలనం..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 6, 2024 11:21 am
Advertisement

Venu Swamy : ఏపీలో ఇప్పుడు అందరి చూపు టీడీపీ కూటమి మీదనే ఉంది. ఎందుకంటే మొదటిసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. గతంలో 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి జనసేన మద్దతు తెలిపింది. కానీ కలిసి పోటీ చేయలేదు. ఈ సారి మాత్రం సీట్లు పంచుకుని మరీ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు పవన్ కల్యాణ్‌ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Venu Swamy : కాపులను నమ్ముకుని..

ఎందుకంటే ఈ సారి గెలవకపోతే మాత్రం ఆయనకు ఎలాంటి రాజకీయ భవిష్యత్ ఉండదనే చెప్పుకోవాలి. అందుకే ఈ ఎన్నికల్లో కనీసం తాను అయినా గెలవాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్‌ టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఏరికోరి మరీ కాపులు ఎక్కువగా ఉండే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ మీద ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ కాబోతున్నాడంటూ సంచలన కామెంట్లు చేశారు. పవన్ కల్యాణ్‌ జాతకం ప్రకారం ఆయన ఎప్పటికీ సీఎం కాలేరు. ఈ ఎన్నికల్లో జనసేనకు భారీ షాక్ తప్పదని ఆయన చెప్పుకొచ్చారు.

Venu Swamy : చంద్రబాబు చేతిలో పవన్ మోసపోతాడు.. వేణుస్వామి సంచలనం..!

Advertisement

టీడీపీ చేతిలో మోసపోవడానికి పవన్ కల్యాణ్‌ సిద్ధంగా ఉండాలంటూ బాంబు పేల్చారు. ఎందుకంటే చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ ది ఉత్తరాషాఢం మకర రాశి, కాబట్టి వీళ్లిద్దరి జాతకాలు పొసగవు. వీరిద్దరి జాతకాల ప్రకారం ఒకరి పార్టీకి ఉండే ఓట్లు ఇంకో పార్టీకి కూడా బదిలీ కాలేవు. ఇదంతా కేవలం ఆయన జాతకాన్ని బట్టి మాత్రమే చెబుతున్నాను. అంతే గానీ.. ఆయనపై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పుకొచ్చారు వేణుస్వామి.ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్‌ రాజకీయ భవిష్యత్ మీద వేణుస్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు జనసైనికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి