Ponguleti Srinivas Reddy : మోదీ ఇచ్చిన ఆఫర్ ఇదే.. అందుకే బీజేపీలోకి.. పొంగులేటి షాకింగ్ వ్యాఖ్యలు వైరల్
Ponguleti Srinivas Reddy : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలుసు కదా. ప్రస్తుతం ఆయన ఏ పార్టీకి వెళ్తారు అని అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన బీజేపీలోకి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన మీడియా సమావేశంలో ఆయన రాజకీయంగా తీసుకునే నిర్ణయంపై మాట్లాడారు. ఆయన వెంట మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు అంటే.. ఏ పార్టీకి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తారు అనేది స్పష్టం అయింది. జూపల్లి గారు చెప్పినా నేను చెప్పినా ఏ తెలంగాణ రాష్ట్రంలో
అయితే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని కలలు కన్న తెలంగాణ ఆశయాలను, ఆలోచనలను తుంగలో తొక్కి వారి వ్యక్తిగత స్వార్థం కోసం సీఎం పాలన చేస్తున్నారు. ఆయన్ను గద్దె దించే అంశంలో అందరం ఏకం కావాలి. అదే అజెండా మీద బీజేపీ ముఖ్య నాయకులు వచ్చారు. వాళ్లు వచ్చి అడిగింది అదే.. మేము మాట్లాడింది అదే. ఇది ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే ఉంది. మా పార్టీలోకి రావాలని గతంలో ఢిల్లీ పెద్దలు అడిగారు. వాళ్ల ఆహ్వానం మేరకే వీళ్లు ఇక్కడికి వచ్చి అడిగారు. అయితే.. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే.. పిలిచిందే తడువుగా అనేదాని కంటే కూడా ఏ ఆలోచనతోనైతే మేము అందరం బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రాబడ్డామో ఆ ఆశయం నెరవేర్చడానికి ఎన్ని మెట్లు అయినా దిగుతాం అన్నారు.
Ponguleti Srinivas Reddy about modi offer for joining in bjp
Ponguleti Srinivas Reddy : తప్పుకుండా ఆ ఆశయం నెరవేరుతుంది
ఆ ఆశయం నెరవేర్చేందుకే తాము ఇవాళ సమావేశం అయ్యాం. కేసీఆర్ ను ఆ సీటు నుంచి దించే కార్యక్రమం, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలిపే కార్యక్రమం, మాయమాటలతో మూడోసారి ముఖ్యమంత్రిగా కావాలని కేసీఆర్ కలలు కంటున్నారు. కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల నేతలు ఎవరైనా వచ్చి తమను వాళ్ల పార్టీలోకి ఆహ్వానించవచ్చు. కానీ.. కేసీఆర్ ను గద్దె దింపేందుకు తాము ఏదైతే కార్యక్రమం అనుకున్నామో.. ఆ ప్లాట్ ఫామ్ ఏర్పడే వరకు తమ పోరాటం కొనసాగుతుంది అని పొంగులేటి చెప్పుకొచ్చారు.
