Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Modi : శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన పదవికి రాజీనామా చేసే అవకాశముందని తెలిపారు. మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని, ఆయన ఈ పర్యటన వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయ నాయకత్వంలో మార్పు కావాలనే ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడిందని, ఈ నేపథ్యంలోనే మోదీ రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం..74 ఏళ్లు పైబడిన వారెవరూ కీలక పదవుల్లో కొనసాగరాదనే నియమం ఉంది. ప్రస్తుతం మోదీ 74వ సంవత్సరంలో ఉన్నారు. సెప్టెంబర్ 17న ఆయన 75వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అతనిని పదవి నుంచి తప్పించాలని చూస్తోందని, తదుపరి ప్రధానమంత్రిని ఆ సంస్థే నిర్ణయిస్తుందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అయితే సంజయ్ రౌత్ వ్యాఖ్యలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. మోదీ 2029లో కూడా ప్రధానమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, రాజీనామా వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. బీజేపీ వర్గాలు కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అంటున్నారు.
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
This website uses cookies.