Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
ప్రధానాంశాలు:
Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Modi : శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన పదవికి రాజీనామా చేసే అవకాశముందని తెలిపారు. మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని, ఆయన ఈ పర్యటన వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయ నాయకత్వంలో మార్పు కావాలనే ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడిందని, ఈ నేపథ్యంలోనే మోదీ రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Modi మోడీ ప్రధాని పదవికి రాజీనామా చేయబోతున్నారంటూ బాంబ్ పేల్చిన ఎంపీ సంజయ్ రౌత్
ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం..74 ఏళ్లు పైబడిన వారెవరూ కీలక పదవుల్లో కొనసాగరాదనే నియమం ఉంది. ప్రస్తుతం మోదీ 74వ సంవత్సరంలో ఉన్నారు. సెప్టెంబర్ 17న ఆయన 75వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అతనిని పదవి నుంచి తప్పించాలని చూస్తోందని, తదుపరి ప్రధానమంత్రిని ఆ సంస్థే నిర్ణయిస్తుందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అయితే సంజయ్ రౌత్ వ్యాఖ్యలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. మోదీ 2029లో కూడా ప్రధానమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, రాజీనామా వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. బీజేపీ వర్గాలు కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అంటున్నారు.