Khammam MP Ticket : ఖమ్మం ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మనం చూశాం. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి ఖమ్మం ఎంపీ టికెట్ అధిష్టానం కేటాయించడంతో చిచ్చు రేగింది. పొంగులేటి కుటుంబసభ్యులకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా ప్రయత్నాలు చేసినట్టు ప్రచారాలు సాగాయి. అయితే పొంగులేటి వియ్యంకుడికి టికెట్ ఇవ్వడం రాష్ట్ర పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డి ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టేందుకు గాను అదిష్టానం ఆ నిర్ణయం తీసుకుందంటూ కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరిగింది. అయితే పొంగులేటిని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి కాగా,ఇప్పుడు ఆయనకే చెక్ పెడుతున్నారా అన్న ప్రశ్న మొదలైంది.
పొంగులేటిని పార్టీలో హైలెట్ చేయడం రేవంత్ రెడ్డి చేసిన మొదటి తప్పు అంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచే తన ‘భవిష్యత్తు’కు బాటలు వేసుకుంటున్నట్టుగా ప్రచారాలు సాగాయి. అసెంబ్లీ ఎన్నికలలో తన వారికి టిక్కెట్స్ ఇప్పించి గెలిపించుకున్నారు. లోక్ సభ ఎన్నికలలో కూడా ఆయన పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. పార్టీలో విధేయుడిగా ఉంటూనే.. ఢిల్లీకి గురిపెట్టారనే అభిప్రాయాలున్నాయి. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం, ఢిల్లీస్థాయిలో తన పరిచయాలు, పార్టీ అధిష్ఠానం వద్ద తన లాబీయింగ్, ఆర్థిక బలం ఇలా అన్నింటిని ఉపయొగించి ఎంపీ టిక్కెట్ కోసం ఢిల్లీ స్థాయిలో ఆయన చక్రం తిప్పుతున్నాడనే ప్రచారం ఉంది.
పొంగులేటి కుటుంబీకులకు టికెట్ వచ్చి ఢిల్లీకి వెళితే పెద్ద దెబ్బ తగిలినట్టే అవుతుందని రేవంత్, భట్టి భావించారు. అయితే పార్టీలో కీలక నేతలంతా వ్యతిరేకిస్తున్నా… పొంగులేటి తన వాళ్లకు టికెట్ ఇప్పించుకోగలిగారు. ఇలా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలైనా జరిగేందుకు ఆస్కారం ఉందనే చర్చ జరుగుతున్నది. భవిష్యత్తులో ఏం జరుగుతుందోననే అనుమానాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.ఇక అటు అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటు ఎంపీ ఎన్నికల్లో తాను సిఫారసు చేసిన అభ్యర్థులకు టికెట్లు ఇప్పించడంలో సీఎం రేవంత్‌రెడ్డి అనుకున్నది సాధించారు. కాని ఖమ్మం టికెట్ మాత్రం పార్టీలో రేవంత్‌రెడ్డి ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టినట్టు తెలుస్తుంది.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.