
Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!
Rappa Politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో ఈ నినాదం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగానే, ఇప్పుడు అదే నినాదంతో బీఆర్‌ఎస్ (BRS) కార్యకర్తలు తెలంగాణలో పోస్టర్లు, ప్లెక్సీ లు ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ నినాదం మొదట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వినిపించగా, ఇప్పుడు అది ప్రత్యర్థులపై సవాలుగా మారుతోంది.
Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!
నిన్న సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో రైతు భరోసా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నాలో ఈ నినాదం మరింత స్పష్టంగా కనిపించింది. హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలు ఈ ధర్నాకు నాయకత్వం వహించగా, బీఆర్‌ఎస్ మద్దతుదారులు ప్లెక్సీ ప్రదర్శన చేశారు. ‘‘2028లో రప్ప రప్ప… 3.0 రీలోడింగ్’’ అంటూ వున్న ఈ ప్లకార్డులు తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. దీని ద్వారా బీఆర్‌ఎస్, 2028లో మళ్లీ అధికారంలోకి వస్తుందని సంకేతాలివ్వడం గమనార్హం.
నేడు సూర్యాపేట లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫొటోలతో కూడిన ప్లెక్సీ లలో కూడా ‘2028లో రప్ప రప్ప… 3.0 రీలోడింగ్’ అంటూ ఏర్పాటు చేసారు. ఒక వైపు ఆంధ్రప్రదేశ్‌లో ఈ నినాదం వివాదాస్పదమవుతుండగా, ఇప్పుడు అదే తెలంగాణకు విస్తరించటం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తోంది. బీఆర్‌ఎస్ ఈ నినాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని, తమ పార్టీ మళ్లీ గెలవబోతుందన్న నమ్మకాన్ని ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ‘3.0 రీలోడింగ్’ పోస్టర్లతో బీఆర్‌ఎస్ తన మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేస్తోందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మరికొంతమంది మాత్రం ఈ ‘రప్ప రప్ప’ గోల ఏంటి అని మాట్లాడుకుంటున్నారు.
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
This website uses cookies.